Arunachal Pradesh: ఎత్తైన కొండల పై నుంచి.. నేలకు జాలువారిన పాలధార.. ఒక్కసారైనా సందర్శించాలని సీఎం ట్వీట్..

భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. తీర్ధయాత్రలు, పుణ్య క్షేత్రాలు, ప్రకృతి అందాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. దేశ వ్యాప్తంగా ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అందునా..

Arunachal Pradesh: ఎత్తైన కొండల పై నుంచి.. నేలకు జాలువారిన పాలధార.. ఒక్కసారైనా సందర్శించాలని సీఎం ట్వీట్..
Yameng Water Falls
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 11, 2022 | 6:54 AM

భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. తీర్ధయాత్రలు, పుణ్య క్షేత్రాలు, ప్రకృతి అందాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. దేశ వ్యాప్తంగా ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అందునా.. ఈశాన్య భారతంలోని ప్రకృతి అందాల గురించి ముందుగా చెప్పుకోవాలి. పచ్చనైన లోయలు, సహజ సిద్ధమైన జలపాతాలతో ఇక్కడి రాష్ట్రాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్, త్రిపుర, అగర్తలా రాష్ట్రాలు పర్యాటకంగా మంచి పేరును సాధించుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని యమెంగ్ జలపాతం అద్భుత సుందర ప్రాంతం. ప్రస్తుతం ఈ వాటర్ ఫాల్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ట్విటర్‌ వేదికగా దీనికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. చుట్టూ విస్తరించి ఉన్న సులుంగ్తి పర్వతాల మధ్య చాలా ఎత్తైన ప్రదేశం నుంచి నేలకు జాలువారుతోన్న పాలధార వీడియో మనసు దోచేస్తున్నాయి.

‘యమెంగ్ జలపాతం అద్భుతమైనది! తవాంగ్- మాగో మార్గంలో ఈ ఐకానిక్ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇక్కడి పచ్చదనం, మనోహర దృశ్యాలు.. మీ ఊహకు అందనంతగా ఆకట్టుకుంటాయి. ప్రకృతి విశిష్టతను ఆస్వాదించేందుకుగానూ ఈ ప్రాంతాన్ని సందర్శించండి’

ఇవి కూడా చదవండి

– పెమా ఖండూ

ఇక్కడి చుమీ గ్యాట్సే 108 జలపాతాల్లో యమెంగ్‌ ఒకటని స్థానికులు చెబుతుంటారు. నెటిజన్లు సైతం యమెంగ్‌ దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు విపతీరంగా ఇష్టపడుతున్నారు. ప్రకృతి అందాలకు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజ్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒక సారైనా సందర్శించాలని కోరుతున్నారు.