Viral: ఒక ఇడ్లీకి 25 రకాల చట్నీలు.. ఇక్కడ కథ వేరే ఉంటది
ఉదయాన్నే ఇడ్లీని వేడివేడి సాంబర్‌లో వేసుకుని, ఆపై కాసింత కారం దానిపై చల్లి తింటే.. టేస్ట్ అదిరిపోతుంది. లైట్‌గా ఉంటుంది.. మంచిగా అరిగిపోతుంది కాబట్టి పొద్దున్నే టిఫిన్ కింద ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు చాలామంది.
ఉదయాన్నే ఇడ్లీని వేడివేడి సాంబర్‌లో వేసుకుని, ఆపై కాసింత కారం దానిపై చల్లి తింటే.. టేస్ట్ అదిరిపోతుంది. లైట్‌గా ఉంటుంది.. మంచిగా అరిగిపోతుంది కాబట్టి పొద్దున్నే టిఫిన్ కింద ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఇదిలా ఉంటే.. ఏ హోటల్ అయినా.. ఇడ్లీకి ఒకటి లేదా రెండు చట్నీలు ఉంటాయి. కానీ చెన్నైలోని కన్నదాసన్ నగరంలో ఉన్న ఓ హోటల్ ఇడ్లీకి ఏకంగా 25రకాల చట్నీలు ఉన్నాయి. సింగిల్ ఇడ్లీకి తంగేడు చట్నీ, పైనాపిల్ చట్నీ, సరస్వతీ ఆకు చట్నీ, గ్రీన్ టీ ఆకు చట్నీ అని మొదలుపెట్టి క్యాబేజీ, ఉలవ, నువ్వులు, వెల్లుల్లి, అల్లం… ఇలా ఊహించలేనన్ని ఆహారపదార్థాల వెరైటీల్ని మన ముందు ఉంచుతారు. వీటిలో వేటిని ఎంచుకుని వేటిని వదిలేయాలో నిర్ణయించుకోలేక సతమతమవుతుంటారు కస్టమర్లు. ఇంతకీ ఇదేమీ బాగా ఖరీదైనది కూడా కాదు… ప్లేట్ ఇడ్లీ 25రూపాయలు మాత్రమే. చౌకగా లభించడంతో పాటు ఇన్ని రకాల చట్నీలను కూడా టేస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్.. ఎంత చట్నీ కావాలంటే అంత తినొచ్చు. మళ్లీ.. మళ్లీ వాళ్లను అడగాల్సిన పనిలేదు. భోజన ప్రియులు ఎప్పుడైనా చెన్నై వెళ్లినప్పుడు ఆ హోటల్‌వైపు ఓ లుక్కేయండి.
Also Read: Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత.. పాలు తాగుతున్న శివాలయంలోని నంది
కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే