AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు తెలుసు మావ..! నీకున్న బలుపు..!! పామును పనిమాలా గెలికిన పిల్లి.. తర్వాత ఏం జరిగిందంటే

పిల్లి, పాము మధ్య జరిగిన థ్రిల్లింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిల్లి పాముతో ఆడుకుంటుండగా, ఆ పాము కోపగించి దానిపై దాడి చేస్తుంది. ఈ హాస్యాస్పదమైన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. పిల్లి కావాలనే పాము ఆటపట్టించసాగింది. దాంతో చిరాకు పడిన పాము ఏం చేసిందో వీడియోలో చూడాల్సిందే.. పిల్లీ వర్సెస్‌ పాము ఫన్నీ వీడియో మీ కోసం..

నాకు తెలుసు మావ..! నీకున్న బలుపు..!! పామును పనిమాలా గెలికిన పిల్లి.. తర్వాత ఏం జరిగిందంటే
Cat And Snake
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2025 | 6:41 PM

Share

వింత, విశేషాలకు కేరాఫ్‌ సోషల్‌ మీడియా.. ఇక్కడ ప్రతినిత్యం అనేక ఫన్నీ వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తాయి. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇది పిల్లి, పాము మధ్య జరిగిన సరదా సంఘర్షణ.. పిల్లి ఉద్దేశపూర్వకంగా పామును రెచ్చగొట్టింది. ఆ తరువాత జరిగినది అందరినీ ఆశ్చర్యపరిచింది. దెబ్బకు పిల్లి అక్కడ్నుంచి పారిపోక తప్పలేదు. ఇలాంటివి కొన్ని కొన్ని వీడియోల ద్వారా అడవి ప్రపంచం మనకు ప్రమాదకరమైన సంఘటనల్ని చూపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటిదే.

వైరల్‌ వీడియోలో ఒక పిల్లి నేలపై హాయిగా పడుకుని ఉండటం కనిపిస్తుంది. అదే సమయంలో ఒక పెద్ద ఆకుపచ్చ పాము అటుగా వెళుతోంది. ఇది చూసిన పిల్లికి సరదాగా గడపాలని అనిపించిందో ఏమో కానీ, చివరకు దాని సరదా తీర్చింది పాము. పిల్లి ఆలోచించకుండా తన దారిలో వెళ్తున్న పామును ఆటపట్టించింది. ఆ తర్వాత పాము కోపంగా బుసలు కొట్టసాగింది. పిల్లిపై దాడి చేసింది. పిల్లి భయపడలేదు కానీ, కొంచం జాగ్రత్తపడింది. కానీ పాము ఆగలేదు. మళ్ళీ పిల్లిపై దాడి చేసింది. కానీ, ఈసారి కూడా పిల్లి దాని బారి నుండి తప్పించుకుంది. పాము దానిపై చాలాసార్లు దాడి చేసింది. కానీ ప్రతిసారీ పిల్లి ప్రతీకారం తీర్చుకుంది. కానీ భయంతో పారిపోలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Hefriadi Mxgp (@hepriadi5z)

ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో hepriadi5z అనే IDతో షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 32 మిలియన్లకు పైగా వీక్షించారు. అయితే 3 లక్షల 83 వేల మందికి పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..