Viral Pic: ఈ ఫోటోలో ఉన్న చిరుతను గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
ఈ మధ్యకాలంలో జనాలు పజిల్స్‌పై ఆసక్తిని కనబరుస్తున్నారు. వారిని సోషల్ మీడియాలోని ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి..
ఈ మధ్యకాలంలో జనాలు పజిల్స్‌పై ఆసక్తిని కనబరుస్తున్నారు. వారిని సోషల్ మీడియాలోని ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇక నెట్టింట ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న చిత్రంలో చిరుత దాగుంది.? అదెక్కడ ఉందో కనిపెట్టండి. కొంచెం చూసేందుకు ఆ ఫోటో గజిబిజిగా ఉన్నా.. అందులో చిరుత ఎక్కడ దాగుందో గుర్తించండి.
ఈ ఫోటోను మొదటిసారి చూసినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ తీక్షణంగా చూస్తే అందులో ఓ చిరుత కనిపిస్తుంది. అడవి దున్నలను వేటాడటానికి చిరుత నక్కి ఉంది. అదును చూసుకుని వాటిపై మెరుపు దాడికి దిగుతుంది. ఆ ఫోటోలోని రాళ్ల రంగు, చిరుత రంగు ఒకేలా ఉంటాయి కాబట్టి.. దాన్ని గుర్తించడం కొంచెం కష్టమే. కానీ మీ మెదడుకు పదును పెడితే అది సాధ్యమవుతుంది. అయితే కొంతమంది ఈ ఫోటోలోని చిరుతను ఈజీగా కనిపెట్టేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ చిరుత ఎక్కడ ఉందో గుర్తించండి చూద్దాం..