Photo Puzzle: కాస్కో నా వాస్కోడిగామా..? ఈ ఫోటోలోని నెంబర్ కనిపెట్టగలరా మావ..
ఎప్పుడూ పని.. పని.. అని ఎందుకు అంత ఆరాటం..? అయితే కొంచెం ఆగండి మాస్టారూ.! మిమ్మల్ని కాస్త డైవర్ట్ చేసేందుకు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ను పెంచేందుకు ఓ క్రేజీ పజిల్ తీసుకొచ్చేశాం. ఇది మీలో రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకురావడమే కాదు.. మీ కంటి చూపునకు కూడా పదునుపెడుతుంది. పదండి దాని లెక్క తేలుద్దాం...

ఎలా ఉన్నారు మావ.. వచ్చేశాం.. మీ కోసం మాంచి పసందైన పజిల్ తెచ్చేశాం. వర్క్ ఎప్పుడూ ఉండేదే. బాస్‌ల టార్గెట్స్ షరామాములే. కాసేపు స్ట్రస్ రిలీఫ్ అయ్యేందకు ఈ పజిల్ ట్రై చేయండి. ఎప్పుడూ పని.. పని అనుకుంటూ మీ గురించి పట్టించుకోవడమే మానేశారు. ఒకప్పుడు మీరు ఎంత స్మార్ట్.. కానీ ఇప్పుడు రోబో అయిపోయారు. అదే పని చక్రంలో తిరిగిపోతున్నారు. అందుకే మీకు కాస్తంత ఆట విడుపుగా ఈ పజిల్ తెచ్చాం. ఇది మీ బుర్రను కాస్త యాక్టివ్ చేస్తుంది. మీ కంటి చూపు పదునును చెప్పేస్తుంది.
పైన ఇచ్చిన ఫోటోను బాగా గమనించండి. బ్లాక్ అండ్ వైట్ డాట్స్‌తో గజిబిజిగా ఉంది అనుకుంటున్నారు కదా.! అవును.. నిజమే.. కానీ ఆ డాట్స్ మధ్య కొన్ని నంబర్స్ ఉన్నాయ్. అవి ఏంటో మీరు కనిపెట్టాలి. ఇది మీ కంటి చూపు ఫోకస్ నెక్ట్స్ లెవల్ అయితే దాన్ని ఈజీగానే పట్టేయవచ్చు. ఫోకస్ పెట్టకపోతే.. మీకు అస్సలు సాధ్యం కాదు. ఆ నెంబర్ మీరు 10 సెకన్లలో గుర్తిస్తే.. మీ తోపులే మాస్టారు. ఒకవేళ ఎంత వెతికినా ఆన్సర్ పసిగట్టలేకపోతే.. వర్రీ అవ్వొద్దు.. ఆ సమాధానం కింద ఇచ్చేస్తున్నాం. ఈ సారి పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు గెలవాలి ఓకేనా… మరిన్ని పజిల్స్ కోసం టీవీ9 ట్రెండింగ్ పేజీ ఫాలో అవ్వండి… బై.. బై.
.
.
.
ఇంతకీ ఆన్సర్ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఆ నంబర్స్ ఏంటంటే… 3246
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..