Job Offers: ఇది కదా జాబ్ అంటే.. క్యాబేజీలను ప్యాక్ చేస్తే రూ. 65 లక్షల జీతం.. పూర్తి వివరాలివే..

Job Offers: ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగులు.. తాము ఎంత ఎక్కువ పని చేసినా జీతం మాత్రం తక్కువగానే ఇస్తున్నారంటూ ఆసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.

Job Offers: ఇది కదా జాబ్ అంటే.. క్యాబేజీలను ప్యాక్ చేస్తే రూ. 65 లక్షల జీతం.. పూర్తి వివరాలివే..
Cabbage

Job Offers: ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగులు.. తాము ఎంత ఎక్కువ పని చేసినా జీతం మాత్రం తక్కువగానే ఇస్తున్నారంటూ ఆసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం అద్భుతమైన ఉద్యోగం గురించి చెప్పుకోబోతున్నాం. పని తక్కువ.. జీవితం ఊహించనంత ఎక్కువ. సాధారణంగా కూరగాయల కటింగ్, ప్యాకింగ్ అంటే ఏ ఐదు వేలో.. పది వేలో జీతం ఇస్తుంటారు. కానీ, ఇక్కడ ఏకంగా రూ. 65 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. అవునండీ బాబూ.. ఇది నిజంగా నిజం. క్యాబేజీని కట్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి రూ. 65 లక్షల ప్యాకేజీని ఉద్యోగులకు ఇస్తున్నారు.

అధికారిక సమాచారం ప్రకారం.. అమెరికాలోని ఓ కంపెనీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. క్యాబేజీ, బ్రోకలనీ కట్ చేసేందుకు ఉద్యోగి కావాలని ప్రకటించింది. ప్రతీ గంటకు 30 డాలర్లు చెల్లించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. అంటే.. భారతీయ కరెన్సీలో 2,250 అనమాట. అంటే రోజుకు చూసుకున్నట్లయితే 18 వేల వరకు జీతం వస్తుంది. అలా ఏడాదికి 65 లక్షలు ఉద్యోగికి జీతంగా ఇస్తాన్నమాట. అయితే, ఈ ఉద్యోగమే కాదు.. అత్యధిక జీతాలు చెల్లించే ఇలాంటి వింత ఉద్యోగాలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. ఆ ఉద్యోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర పోవడమే ఉద్యోగం..
చాలా మంది తాము చేసే పని వలన నిద్ర కూడా పట్టడం లేదని, అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఉద్యోగం అని చెప్పింది. ఇక్కడ నిద్రపోవడమే ఒక ఉద్యోగం. ప్రపంచ దేశాల్లో ఉండే చాలా హోటల్స్.. నిద్రలో నిపుణులను నియమించుకుంటాయి. వారిచేసేదల్లా ఒక్కటే.. నిద్రపోవడం. ఈ హోటల్‌కు ఎవరు వచ్చినా చక్కటి నిద్ర పడుతుందని నిరూపించడమే. అలా చేయడం ద్వారా వారికి లక్షల్లో వేతనాలను అందజేస్తారు. అంతేకాదు.. శాస్త్రవేత్తలు సైతం తమ పరిశోధనల కోసం ప్రొఫెషనల్ స్లీపర్‌ లను నియమించుకుంటారు.

ఐస్క్రీమ్ తినే ఉద్యోగం..
చాలామంది ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఐస్ క్రీమ్ తినే ఉద్యోగం వస్తే ఎలా ఉంటుందో ఊహించండి? తినడమే కాదు.. ఐస్ క్రీమ్ తిన్నందుకు మంచి జీతం కూడా ఇస్తామంటే ఎవరైనా ఆగుతారా? ఎగిరి గంతేస్తారు. ఐస్ క్రీమ్ తయారీదారులు వాటిని పరీక్షించడానికి వ్యక్తులను నియమించుకుంటారు. వారి పని ఐస్ క్రీమ్‌ను తిని పరీక్షించడం. ఇందుకోసం.. సదరు వ్యక్తులకు 40 వేల నుండి లక్ష రూపాయల వరకు జీతం ఇస్తారు.

భోజనం చేసే ఉద్యోగం..
అనేక దేశాలలో ఈ వింత ఉద్యోగం ఉంటుంది. వివాహ వేడుకకు హాజరయ్యే వారి సంఖ్యను పెంచేందుకు ఇలాంటి ఉద్యోగులను నియమించుకుంటారు. వీరు చేయాల్సిందల్లా.. పెళ్లికి వెళ్లి భోజనం చేసి రావడమే. అలా వెళ్లి భోజనం చేసినందుకు డబ్బులు కూడా చెల్లిస్తారు. అంటే డబ్బులు చెల్లించి అతిథులుగా ఆహ్వానిస్తారన్నమాట.

ఏడ్చే ఉద్యోగం..
ఎవరైనా మరణిస్తే ఏడ్చేందుకు వ్యక్తులను నియమించుకుంటారు. చనిపోయిన వ్యక్తుల ముందు ఏడ్చేందుకు వ్యక్తులకు డబ్బులు చెల్లిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ఉంది.

Also read:

Dragonfly: తూనీగలు హెచ్చరిస్తున్నాయా.. మేఘం రంగును గమనిస్తున్నాయా.. కోనసీమవాసుల్లో కొత్త గుబులు..

French President: ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న అధ్యక్షుడు.. దూసుకొచ్చిన కోడిగుడ్డు

Inspiring Story: ఆర్ధిక పరిస్థితి అడ్డంకిగా మారినా.. వాటిని అధిగమించి ఐఏఎస్ ఆఫీసరైన బస్సు డ్రైవర్ కూతురు..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu