Viral Video: ఛీ.. ఛీ.. బెకరీలో ఇదేం పాడు పని.. అందమే కాదు కాస్త బుర్ర ఉండాలి.. మోడల్‌పై మండిపడుతున్న నెటిజన్లు..
ఓ మోడల్ చేసిన పని నెట్టింట దుమ్ముదుమారంగా మారింది.. ఓ మార్ట్‌లో బ్రిటీష్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ చేసిన వికృత చేష్టలపై నెటిజన్లు మండి పడుతున్నారు.. ఇది చెత్త కాదు పరమ చెత్త పని.. అంటూ నెటిజన్లు మోడల్‌ని ఏకిపారేస్తున్నారు.. అసలేం జరిగిందంటే..
ప్రతిదీ.. జోక్ కాదు.. కానీ కొంతమంది అలాంటి వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ఏదో చేయబోయి.. ఇంకేదో చేసి నవ్వులపాలు అవుతుంటారు.. అలానే.. ఓ మోడల్ చేసిన పని నెట్టింట దుమ్ముదుమారంగా మారింది.. ఓ మార్ట్‌లో బ్రిటీష్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ చేసిన వికృత చేష్టలపై నెటిజన్లు మండి పడుతున్నారు.. ఇది చెత్త కాదు పరమ చెత్త పని.. అంటూ నెటిజన్లు మోడల్‌ని ఏకిపారేస్తున్నారు.. అసలేం జరిగిందంటే.. బ్రిటీష్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ క్లో లోపెజ్.. స్పెయిన్‌లో ఉన్నప్పుడు ఏదైనా ‘దానం’ చేయాలని నిర్ణయించుకుంది.. అది కూడా వికృత పనితో వైరల్ అవ్వాలని రీల్ చేసింది.. అది కాస్త.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. దుమ్ముదుమారంగా మారింది.. వాస్తవానికి ‘దానం’ అనేది చాలా గొప్పది.. ఏ దానం చేసినా.. ఒకరికి మంచి చేసేదిగా వారి అవసరానికి తగినట్లుగా ఉండాలి.. కానీ ఇమే చేసిన దానం.. విమర్శలను తెచ్చిపెట్టింది.. ఆ దానం ఏంటో అనుకునేరు.. మోడల్ క్లో లోపెజ్ చేసింది.. లోదుస్తుల దానం.. అవును, మీరు సరిగ్గానే చదివారు. బ్రిటీష్ మోడల్ స్పెయిన్‌లోని ఒక సూపర్ మార్కెట్‌లో ఫ్రిజ్‌పై ఉన్న బ్రెడ్ ట్రేలో తన లోదుస్తులను వదిలివేసింది. ఇదే వీడియోని షేర్ చేస్తూ, మోడల్ క్లిప్ క్యాప్షన్‌లో దీనిని ‘విరాళం’ అంటూ పేర్కొంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మోడల్ లోపెజ్ చేసిన పనిపై అసహ్యమంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు బుద్ది ఉండాలంటూ కామెంట్ల రూపంలో ఫైర్ అవుతున్నారు. దీంతోపాటు మోడల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు సిగ్గు లేదని.. ఇది ప్రజారోగ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరం అంటూ పేర్కొంటున్నారు. ఆహారాన్ని, దేశాన్ని గౌరవించండి అంటూ సూచిస్తున్నారు. ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని కొందరు సూచించగా.. మరికొందరు ఆమె తన దేశానికి వెళ్లి ఇలాంటివి చేయాలంటూ పేర్కొంటున్నారు. ఆమెకు మర్యాద ఏంటో తెలియదని.. ఛీ.. అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
కాగా.. ఈ వీడియోను క్లో లోపెజ్ ఆగస్టు 11న షేర్ చేయగా.. నాలుగువేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్లో లోపెజ్’ హ్యాండిల్ లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌కు “విరాళం ఇవ్వడం” అనే శీర్షికకు జతచేయగా.. నెట్టింట వైరల్ గా మారింది..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..