Viral Video: వామ్మో.. భయానక దృశ్యం.. అర్థరాత్రి రోడ్డుపై ఒంటరిగా రెండేళ్ల చిన్నారి వాకింగ్..
సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ఇలా కూడా జరుగుతుందా? ఇలా కూడా అవుతాయా అనిపిస్తుంది. ఇంటర్నెట్‌లో ఎక్కువగా చిన్న పిల్లలకు, జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. ఇంకొన్ని భయాన్ని పుట్టిస్తాయి. వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. ఈ వీడియో చూశారంటే నిజంగానే చాలా భయంగా..
సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ఇలా కూడా జరుగుతుందా? ఇలా కూడా అవుతాయా అనిపిస్తుంది. ఇంటర్నెట్‌లో ఎక్కువగా చిన్న పిల్లలకు, జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. ఇంకొన్ని భయాన్ని పుట్టిస్తాయి. వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. ఈ వీడియో చూశారంటే నిజంగానే చాలా భయంగా అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లాడు అర్థరాత్రి సమయంలోనే నడుచుకుంటూ వెళ్లడం నిజంగానే వణుకు పుట్టించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఒక రేంజ్‌లో వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఈ వైరల్ వీడియోలో.. ఓ ఇంటి నుంచి రెండేళ్ల పిల్లవాడు బయటకు నడుచుకుంటూ వచ్చాడు. చెప్పులు వేసుకుని వీధుల్లో ఎంతో సంతోషంగా నడుస్తున్నాడు. ఆ సమయంలో అసలు ఎవరూ అక్కడ లేరు. ఆ పిల్లవాడు ఏమాత్రం భయ పడకుండా ఆ సమయంలో వీధుల్లో నడవడం నిజంగానే.. వీడియో చూసే వారిలో వణుకు పుట్టించింది. వాళ్ల తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో పిల్లోడు బయటకు వచ్చాడు. అది కూడా అర్థరాత్రి 3 గంటల సమయంలో.. రోడ్డుపై ఆ చిన్నారి ఆడుకుంటూ ఆనందంగా నవ్వుతూ కనిపించింది. ఇలా వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొన్ని గంటల్లోనే పిల్లవాడు మరణించాడు.
జితేంద్ర సింగ్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోను ఇప్పటికే మూడు లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధ్యతపై కొందరు మళ్లీ ప్రశ్నలు సంధించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
వీడియో చూడండి..
Scary 😱
A 2-year-old child in West Delhi went out for a walk at 3:45 AM while his parents were sleeping.
He unlocked the gate of the house and went out.
He was found a day later. pic.twitter.com/0WPv0MDEnP
— Jitender Singh (@jitenderkhalsa) August 18, 2024