Viral Video: ఏంటక్కా.. పాము అనుకున్నావా.. పొట్లకాయ అనుకున్నావా? వీడియో చూస్తే గుండె గుబేల్..
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియో జోరుగా వైరల్ అవుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. పాములకు సంబంధించి ఎలాంటి కొత్త వీడియోలు వచ్చినా నెట్టింట ప్రత్యక్షం అవుతాయి. పామును చూస్తేనే గుండె గుబేల్ అంటుంది. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి ఇంట్లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. బట్టల్లో, బెడ్ కింద, చెప్పుల్లో..
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియో జోరుగా వైరల్ అవుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. పాములకు సంబంధించి ఎలాంటి కొత్త వీడియోలు వచ్చినా నెట్టింట ప్రత్యక్షం అవుతాయి. పామును చూస్తేనే గుండె గుబేల్ అంటుంది. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి ఇంట్లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. బట్టల్లో, బెడ్ కింద, చెప్పుల్లో దాక్కుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్లోకి దూరింది పాము. అయితే పామును చూసిన ఆ అమ్మాయి ఏం చేసిందో చూస్తే నిజంగానే షాక్ అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం కూడా చూసేద్దాం.
వీడియోలో.. పాము ఓ ఇంట్లోకి దూరింది. పామును చూసిన ఓ అమ్మాయి.. ఏమాత్రం భయ పడుకుండా దాన్ని పట్టుకుని దానితో ఆటలాడటం మొదలు పెట్టింది. పామును పట్టుకుని గిరా గిరా మని తిప్పుతూ ఉంది. అది చూసిన చుట్టు ప్రక్కల జనం ఎంతో భయ పడ్డారు. ఇంటి నుంచి బయటకు రాగానే ఆ పామును జనంలో తిప్పుతూ ఉంది. వర్షం కూడా గట్టిగానే పడుతుంది. ఆ వానలో ఆ అమ్మాయి పాముతో ఫీట్లు చేస్తుంది. చివరికి ఆ పామును ఓ సంచిలో వేసి మూట గట్టి.. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ మళ్లీ పాముతో ఆట ఆడి.. తిరిగి అక్కడ వదిలిపెట్టింది. ఈ వీడియో చూస్తుంటే ఇది అంతా కావాలనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కావాలనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ‘అది పామునా లేక రబ్బరు పామునా ఆడుకుంటున్నావ్’.. ‘హే క్యూటీ.. అది ఒక్క కాటే వేస్తే నీ బ్యూటీ మటాష్’.. ‘ఆ పాముకు విషం తీసేశారనుకుంటా.. అందుకే ధైర్యంగా ఆడుతుంది’ అంటూ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
View this post on Instagram