Brilliant Dog: లెక్కల్లో దిట్ట ఈ కుక్క.. ప్రశంసిస్తున్న నెటిజన్లు.. చూస్తే మీరే షాకవుతారు.. వీడియో
Brilliant Dog video viral: భూమిపైనున్న జీవులన్నింటిలో శునకం ప్రత్యేకమైనది. విశ్వాసంలో కుక్క తర్వాతే ఎవరైనా అనే నానుడి మనందరికీ గుర్తే ఉంటుంది. దానిని

Brilliant Dog video viral: భూమిపైనున్న జీవులన్నింటిలో శునకం ప్రత్యేకమైనది. విశ్వాసంలో కుక్క తర్వాతే ఎవరైనా అనే నానుడి మనందరికీ గుర్తే ఉంటుంది. దానిని ప్రేమగా చేరదీస్తే చాలు.. ప్రాణం ఇవ్వడానికి సైతం వెనుకాడదు. అలాంటి కుక్కల్లో బ్రిలియంట్ కుక్కలు కూడా ఉంటాయి. చిన్నపాటి దొంగల కేసుల నుంచి యుద్ధాల వరకూ వాటి సేవలు వర్ణించలేనివి. అందుకే కుక్కలను చాలామంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటారు. అలాంటి కుక్కలకు కొంచెం తర్ఫీదునిస్తే చాలు ఎంతటి పనినైనా చిటికెలో చేస్తాయి.. ఎదైనా నేర్చుకునేందుకు ముందుంటాయి. అలాంటి విశ్వాసం గల కుక్కకు ఓ వ్యక్తి గణితం పాఠాలు బోధించాడు. ఇంకేంది ఆ కుక్క తాను ఏదీ చెబితే.. అన్ని సార్లు అరుస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వైరల్ వీడియోలో.. శిక్షకుడు వన్, త్రీ, ఫైవ్ అంటూ చెబుతుంటే.. అన్ని సార్లు కుక్క అరుస్తూ కనిపిస్తుంది. ఈ కుక్కను చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఈ కుక్క గణితంలో జీనియస్ అంటూ పేర్కొంటున్నారు. దీనిని ముంబైకు చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ కుక్క గణితంలో అద్భుతంగా రాణిస్తుందని.. దీనికి అవార్డు ఇవ్వాలంటూ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా.. శిక్షకుడిని ప్రశంసించడంతోపాటు కుక్కను అభినందిస్తున్నారు.
? And the award for excellence in mathematics goes to…… ? pic.twitter.com/TyDp2MLGoi
— Nigel D’Souza (@Nigel__DSouza) March 19, 2021
Also Read: