Viral: దొంగలకే దొంగ ఈ ‘మంచి దొంగ’.. దొంగతనానికి వెళ్లి ఇలా ఇరుక్కుపోయాడేంటబ్బా.!
Viral News Latest: సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు ఏం చేస్తారు..? తాను కాజేయాలనుకున్న ఇంట్లోకి వెళ్లేందుకు సరైన మార్గాన్ని ఎంచుకుని అందినకాడికి..
Viral News Latest: సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు ఏం చేస్తారు..? తాను కాజేయాలనుకున్న ఇంట్లోకి వెళ్లేందుకు సరైన మార్గాన్ని ఎంచుకుని అందినకాడికి దోచుకుపోతారు..? కానీ ఇక్కడ ఓ దొంగ విచిత్రంగా ఎవరూ ఎంచుకోని మార్గంలో లోపలికి వెళ్లేందుకు ట్రై చేసి ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఓ ఇంటిని దోచుకోవడానికి వెళ్ళిన దొంగ తనకు తానుగా ఇరుక్కుపోయాడు. అతని తల రైలింగ్‌లో చిక్కుకుంది. ఆశ్చర్యకరంగా, దాదాపు మూడు గంటలు అతను దాని నుంచి రాలేకపోయాడు. అక్కడ ఉంటున్న స్థానికులు కొంతమంది ఆ దొంగను చూసి అత్యవసర సేవా సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని అతికష్టం మీద ఆ దొంగ తలను రైలింగ్ నుంచి తీశారు.
‘ఈ విధంగానే దొంగను తొలగించారు’
అత్యవసర సేవా సిబ్బంది రైలింగ్‌ను కట్టర్‌తో కత్తిరించగా.. ఆ సమయంలో కొంతమంది దొంగ పడకుండా పట్టుకున్నారు. అతి కష్టం మీద, దొంగను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు, తరువాత పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అక్కడున్న ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి:
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!