Viral Video: ఎందిరయ్య ఇదీ.. స్టేజీపైనే వరుడిని పొట్టుపొట్టుగా కొట్టిన వధువు.. షాకింగ్ వీడియో
పెళ్లికి ముందు వధూవరుల దండలు మార్చుకోవడం సర్వసాధారణం. ఈ సందర్భంగా వధూవరులు సంతోషంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు.

Wedding Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిలో నూతన వధూవరులు ఇద్దరు పొట్లాడుకుంటూ కనిపించారు. మిఠాయి తినిపించే దగ్గర వచ్చిన ఈ గొడవ.. నవ్వులు పూయిస్తోంది. పెళ్లికి ముందు వధూవరుల దండలు మార్చుకోవడం సర్వసాధారణం. ఈ సందర్భంగా వధూవరులు సంతోషంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. జబర్దస్తీగా ఇద్దరూ మిఠాయిలు తినిపించుకొని.. కొట్లాడుకునే వరకు వెళ్తారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. వధూవరులు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం ఇద్దరూ స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా వధువు ముందుగా వరుడికి స్వీట్ తినిపిస్తుంది. అయితే.. వరుడికి ఇష్టం లేకపోయినా ఆమె బలవంతంగా మిఠాయిని తినిపిస్తుంది. ఆ తర్వాత వరుడు కూడా స్వీట్ తినిపించేందుకు రెడీ అవుతాడు. కానీ.. ఆమె మొహం పక్కకు తిప్పుకుంటుంది. దీంతో వరుడికి కోపం వచ్చి బలవంతంగా స్వీట్ తినిపిస్తాడు. దీంతో వధువుకి కోపం వస్తుంది. వెంటనే వరుడిని చేతితో కొడుతుంది. ఇది చూసిన బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే.. దీనికి సంబంధించిన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ నవ్వుకోవడంతోపాటు.. షాకవుతున్నారు.




ఫన్నీ వీడియో చూడండి:
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో asliashishmishra అనే యూజర్ షేర్ చేయగా.. 23 లక్షల మంది వీక్షించారు. అయితే 22 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉన్నారు.. వైవాహిక జీవితంలో ఎలా ఉంటారోనంటూ ఒకరు పేర్కొనగా.. బహుశా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేదేమోనంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..