AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మానవత్వం సిగ్గుపడేలా.. వీధి కుక్కపట్ల వికృత చేష్టాలు..! షాకింగ్‌ వీడియో వైరల్‌

కానీ, మనుషుల్లో కొందరు మాత్రం నోరులేని మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి అమానవీయ ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో అనేకం వైరల్‌ కావటం చూశాం.. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Viral Video: మానవత్వం సిగ్గుపడేలా.. వీధి కుక్కపట్ల వికృత చేష్టాలు..! షాకింగ్‌ వీడియో వైరల్‌
Stray Dogs
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2024 | 1:14 PM

Share

కుక్కలు మనుషులకు అత్యంత ప్రియమైన పెంపుడు జంతువు.. చాలా మంది ఇళ్లలో కుక్కను పెంచుకుంటూ ఉంటారు. వాటిని తమలో ఒకరిగా భావిస్తారు. వాటికి పుట్టిన రోజులు, సీమంతం, బారసాల వంటి శుభకార్యాలు కూడా చేస్తుంటారు. ఇక ప్రేమతో పెంచుకున్న కుక్క చనిపోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. దశదిన కర్మ కూడా చేస్తుంటారు. ఆ పెంపుడు శునకం పేరిట చుట్టుపక్కల వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. కానీ, మనుషుల్లో కొందరు మాత్రం నోరులేని మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి అమానవీయ ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో అనేకం వైరల్‌ కావటం చూశాం.. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ భూమిపై లక్షలాది జీవులు సంచరిస్తున్నాయి. ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి దేవుడు అందరికీ సమాన అవకాశాన్ని ఇచ్చాడు. కానీ మానవ విస్తరణ విధానాలు అనేక జీవుల ఉనికిని తుడిచిపెట్టేశాయి. కొన్ని దాదాపు అంతరించిపోయాయి. మనుషులతో స్నేహంగా ఉండే కొన్ని జంతువులు ఏదో ఒకవిధంగా మానవ నివాసాలలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆవులు, పిల్లులు, కుక్కలు సాధారణంగా కనిపిస్తాయి. అవి మానవ కార్యకలాపాలలో జోక్యం చేసుకోవు. అందుకే అవి మానవ నివాసాలలో చోటు సంపాదించాయి. కానీ కొన్నిసార్లు కొందరు వ్యక్తులు నోరులేని జంతువుల పట్ల కూర్రంగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి ఘటనలు చూస్తుంటే.. మనుషుల్లో మానవత్వం పూర్తిగా చనిపోయిందా అనే సందేహం కలుగుతుంది. ఇటీవల ఓ వీధి కుక్క కళ్లు, నోరు కట్టేసి నడిరోడ్డుపై వదిలేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

వైరల్‌ వీడియోలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఒక కుక్క ముఖాన్ని గుడ్డతో కట్టేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ కుక్క ముఖానికి మాస్క్ కట్టి నడిరోడ్డుపై వదిలేశారు. కళ్లు కనిపించక పోవటంతో పాపం ఆ కుక్క నరకయాతన పడుతోంది. రోడ్డుపై వాహనాల రద్దీ కారణంగా ఆ శునకం భయం భయంగా ముందుకు నడుస్తోంది. అది గమనించిన ఒక బైకర్‌ ఆ కుక్క కష్టాన్ని దూరం చేశాడు. కుక్కను కట్టేసి ఉంచిన టవల్‌ తొలగించాడు. ఆ మాస్క్‌ తీయగానే కుక్క ఒక్కసారిగా ఒక నిట్టూర్పు తీసుకుని, తనకు వెలుగునిచ్చిన వ్యక్తి దీనంగా చూస్తుంది. ఆ తరువాత బైకర్‌ తన దారిన తను వెళ్లిపోగా, కుక్క కూడా ఆహారం వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారటంతో నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. @Gulzar_sahabX ఖాతాలో షేర్ చేయబడిన వీడియో వేగంగా వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..