Watch: కెనడాలో భారతీయుడి పరిస్థితి.. బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తున్న ఓనర్‌.. వీడియో వైరల్‌

ఎందుకు అబద్దం చెప్పావు అంటూ అతడు గట్టిగా అడగడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని ఓ యూజర్ కామెంట్ చేశారు.

Watch: కెనడాలో భారతీయుడి పరిస్థితి.. బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తున్న ఓనర్‌.. వీడియో వైరల్‌
Indian Tenant In Canada
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 05, 2024 | 10:20 AM

సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ, పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా భూమి సరిపోవడం లేదు. దీంతో చాలా మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. అయితే, ఈ ఇంటి అద్దెలు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంటాయి. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ అద్దెలు మరింత ఎక్కువగా ఉంటాయి. అలాగే, మన దేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన వారు కూడా అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అక్కడి ఇంటి ఓనర్లు పెట్టే ఇబ్బందులు కూడా తప్పక భరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. కెనడాలో ఇంటి బలవంతంగా ఒక వ్యక్తి వస్తువులను బయటకు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఇంటర్‌నెట్‌ వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కెనడాలో అద్దింట్లో ఉన్న ఓ భారతీయుడి సామాగ్రిని ఆ ఇంటి యజమాని బయట పారేస్తున్న సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వ్యక్తి ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. వీడియోలో ఇంటి యజమానిపై ఆ వ్యక్తి అరుస్తూ, ఎందుకు అబద్దం చెప్పావు అంటూ అతడు గట్టిగా అడగడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

X ఖాతా షేర్‌ చేసిన ఈ వీడియో క్లిప్ కెనడాకు చెందినదిగా తెలిసింది. వీడియో ఆధారంగా భారత్‌ చెందిన ఒక వ్యక్తి అక్కడ ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కాగా అతనికి ఆ ఇంటి యజమానితో ఏదో గొడవ జరిగింది. దీంతో అతను ఇల్లు ఖాళీ చేయమని పట్టుబట్టాడు. అందును అతను అంగీకరించికపోవటంతో స్వయంగా ఆ ఇంటి యజమాని రంగంలోకి దిగారు. సదరు వ్యక్తి సామాగ్రిని బయటకు విసురుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..