AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 3 రూపాయలకే తిన్నోడికి తిన్నంత బిర్యానీ.. బంపర్ ఆఫర్ లగెత్తండి..!

టీ తాగితే పది రూపాయలు అవుతుంది. వక్కపొడి ప్యాకెట్ కూడా కనీసం ఐదు రూపాయలు పెడితే గానీ రాదు. మరి ఇపుడు మూడు రూపాయలకు ఏం వస్తుంది. తిన్నంత బిర్యానీ వస్తుంది..! ఇది విని అవునా..నిజమా అంటూ దీర్ఘాలు తీయకండి. ఎందుకంటే నిజంగా ఇదే జరిగింది. కేవలం మూడు రూపాయలకే తినొళ్లకు తిన్నంత బిర్యానీ వడ్డిస్తున్నారు ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు..? ఎక్కడ..?ఏంటీ మ్యాటర్‌ అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

రూ. 3 రూపాయలకే తిన్నోడికి తిన్నంత బిర్యానీ.. బంపర్ ఆఫర్ లగెత్తండి..!
Biryani
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 05, 2024 | 12:33 PM

Share

బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరూ ఉండరు. బిర్యానీ పేరు చెబితేనే లోట్టలేసుకుని ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంటారు. సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లలో మిగతా ఐటమ్స్ తో పోలిస్తే బిర్యానీ రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ, అక్కడ మాత్రం బిర్యానీ కోసం భోజన ప్రియులు బారులు తీరారు. అక్కడికి బిర్యానీ కోసం వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అంతేకాక క్యూ లైన్ లో తోపులాట జరగకుండా కాపలాగా సెక్యూరిటీని సైతం నియమించారు. ఏంటి ఇదంతా నిజమేనా.. బిర్యానీ కోసం ఇంత చేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు.. నిజంగానే ఇలా జరిగిందండి బాబు.. ఎందుకంటే అక్కడ కేవలం రూ. 3 కే బిర్యానీ వడ్డిస్తున్నారు. మరి ఇంకేం..జనం ఊరుకుంటారా… ఏప్పుడేప్పుడు బిర్యాని తిందామా అంటూ లొట్టలు వేసుకుంటూ ఆ రెస్టారెంట్ వద్దకు పరుగులు తీశారు.

అయితే ఇదంతా కేవలం మూడు గంటల ఆఫర్ మాత్రమే అని తెలిసి పలువురు నిరాశకు లోనయ్యారు. ఈ ఆఫర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో నూతనంగా ప్రారంభించిన అన్లిమిటెడ్ రెస్టారెంట్లో పెట్టారు. భీమడోలు, తాడేపల్లిగూడెంలో ఇప్పటికే అన్లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లను యాజమాన్యం ప్రారంభించింది. వ్యాపార అభివృద్ధిలో భాగంగా జంగారెడ్డిగూడెంలో మరో కొత్త బ్రాంచ్ ని ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. మూడు రూపాయలకే బిర్యానీ అంటూ వారం రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిసిటీ చేశారు.. మామూలుగానే బిర్యానీ అంటే ఎగబడి తింటారు. అలాంటిది మూడు రూపాయలు అంటే ఆగుతారా… అనుకున్న దాని కంటే భారీగా బిర్యానీ ప్రియులు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.

మూడు రూపాయల ఆఫర్ కోసం వచ్చే కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెస్టారెంట్ బయట యాజమాన్యం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మూడు రూపాయలకు బిర్యానీ కావలసినవారు వరుసగా క్యూలైన్లో వచ్చి 3రూపాయలు చెల్లిస్తే చాలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు.. అయితే క్యూ లైన్ లలో తోపులాట, ఘర్షణలు జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీని సైతం రెస్టారెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం మూడు గంటలు మాత్రమే ఆఫర్‌ ఉండడంతో అవకాశం వినియోగించుకోలేని ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సుమారు నాలుగు వేల నుండి 5 వేల మంది ఈ ఆఫర్ ను వినియోగించుకున్నట్లు రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.

ఇవి కూడా చదవండి

అంతేకాక ఈరోజు రెస్టారెంట్‌లో దొరికే ఇతర ఐటమ్స్ పై కూడా అన్లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించారు. రూ .290 రూపాయలకే ఒక వ్యక్తి తిన్నంత బిర్యానీ, రూ.380 కి ఒక వ్యక్తి నాలుగు రకాల స్టార్టర్లతో పాటు ఏవైనా ఎంతైనా తినే ఆఫర్, అలాగే రూ. 580 కి ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్ లో ఉన్న మెనూలో 30 రకాల ఐటమ్స్ ఎంతైనా తినే ఆఫర్, ఇలా అనేక అన్లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించారు. దీంతో రెస్టారెంట్ భోజన ప్రియులతో నిండిపోయి కిటకిటలాడింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు