Viral News: యాటిట్యూడ్ మడిచి పాకెట్‌లో పెట్టుకో.. క్యాబ్‌లో డ్రైవర్ పెట్టిన రూల్స్ చూస్తే.. షాకవ్వాల్సిందే
ఈ మధ్య కాలంలో నెటిజన్ల ప్రవర్తణతో విసిగిపోయిన క్యాబ్ డ్రైవర్స్ తమ కారులో కొన్ని నిబంధనలు పెడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కార్‌లో పెట్టిన రూల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అతను పెట్టిన రూల్స్ చూస్తే.. మీరు షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో నెటిజన్ల ప్రవర్తణతో విసిగిపోయిన క్యాబ్ డ్రైవర్స్ తమ కారులో కొన్ని నిబంధనలు పెడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కార్‌లో పెట్టిన రూల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. బెంగళూరుకు చెందిన ఒక ప్రయాణికుడు క్యాబ్ ఎక్కినప్పుడు ఆ కారులోని డ్రైవర్ సీటు వెనుక అతికించి ఉన్న పోస్టర్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత దాన్ని తీసి రెడ్డిట్‌టో షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్స్ స్పందించారు. కొంత మంది వీటిని సపోర్ట్ చేసినా మరి కొందరు తిరస్కరించారు. క్యాబ్‌లో కూడా ఇలాంటి రూల్స్ ఉంటాయా అని మరికొందరు కామెంట్స్ చేశారు.
ఈ వైరల్ పోస్ట్‌లో కనిపించే ఏడు రూల్స్‌ను సదురు క్యాబ్ డ్రైవర్ తన సీటు వెనక అతికించి ఉంచారు. తాము రోజు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను అతను అందులో పేర్కొన్నాడు. వాటిని ప్రయాణికుల దృష్టికి తీసుకెళ్లి తమ ప్రవర్తణ మార్చుకోవాలని చెప్పాలనుకున్నాడు. ఆ వైరల్ పోస్ట్‌లోని నియమాలు ఇక్కడ చూడండి.
- మీరు క్యాబ్‌కు ఓనర్ కాదు
- క్యాబ్ నడుపుతున్న వ్యక్తి క్యాబ్ ఓనర్.
- మర్యాదగా మాట్లాడండి అలాగే గౌరవంగా ప్రవర్తించండి.
- మీరు క్యాబ్ ఎక్కే టప్పుడు, దిగేటప్పుడు డోర్ నెమ్మదిగా వేయండి
- క్యాబ్‌లో ఎక్కిన తర్వాత మీ యాటిట్యూడ్ మడిచి జేబులో ఉంచుకోండి. దానిని మా ముందు చూపెట్టొద్దు. ఎందుకంటే మీరు మాకు ఎక్ట్రా డబ్బులేమి ఇవ్వట్లేదు.
- ముఖ్యం నన్ను భయ్యా అని పిలవకండి.
- నన్ను స్పీడ్‌గా డ్రైవ్ చేయమని చెప్పకండి.
ఈ పోస్ట్ గురించి నెటిజన్లు ఏమన్నారు?
అయితే ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంలో చాలా మంది యూజర్స్ స్పందించారు. నేను ఈ పోస్ట్‌కు మద్దతు ఇస్తున్నాను.. ఎందుకంటే కొంతమంది ప్రయాణీకులు క్యాబ్‌లను వారి సొంతవాటిలా ఫీల్ అవుతారు. “మీ యాటిట్యూడ్ మడిచి మీ జేబులో ఉంచుకోండి అనే లైన్‌ను చూసి నేను చాలా నవ్వుకున్నా అని మరో యూజర్ కామెంట్ చేశాడు. వేగంగా వెళ్లి, “షార్ట్‌కట్ ఉందా?” అని అడిగే వారికి ఈ పోస్ట్ సరైనదని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు, “అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను ‘బయ్యా’ అని ఎందుకు పిలవలేదో నాకు అర్థం కావడం లేదు” అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
