AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బిచ్చమెత్తినా బిజినెస్ అదిరింది..! 8 గంటల్లో ఎంత కలెక్షనో తెలిస్తే మైండ్‌బ్లాక్..!

హరిద్వార్ కావడ్ మేళాలో ఒక యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం వైరల్ అయ్యింది. కేవలం 8 గంటల్లో QR కోడ్ సహా సుమారు ₹4,000 సేకరించడం ఆశ్చర్యపరిచింది. ఇది భిక్షాటనను 'బిజినెస్'గా చూడటంపై, లేదా 'కొత్త స్టార్టప్ ఐడియా'గా పరిగణించడంపై విస్తృత చర్చకు దారితీసింది. అయితే, ఈ ఆదాయం వెనుక ఉన్న పేదరికం, కష్టాలు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Viral Video: బిచ్చమెత్తినా బిజినెస్ అదిరింది..! 8 గంటల్లో ఎంత కలెక్షనో తెలిస్తే మైండ్‌బ్లాక్..!
Begging Business
Balaraju Goud
|

Updated on: Aug 20, 2026 | 8:59 PM

Share

హరిద్వార్‌లో జరుగుతున్న ప్రసిద్ధ కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 గంటల పాటు భిక్షాటన చేసి సుమారు రూ. 4,000 సేకరించినట్లు వీడియోలో చూపించారు. అయితే ఈ ప్రయోగం భిక్షాటనపై కొత్త చర్చకు దారితీసింది.

పురుషోత్తం వశిష్ట్ అనే యూట్యూబర్ తన స్నేహితుడు సచిన్‌తో కలిసి ఈ ప్రయోగం చేపట్టారు. అసలు ఒక రోజులో భిక్షాటన ద్వారా ఎంత డబ్బు సేకరించవచ్చో తెలుసుకోవడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగా సచిన్ మురికిగా కనిపించేలా ముఖానికి రంగు వేసుకుని, చిరిగిన దుస్తులు ధరించి భక్తుల మధ్య భిక్ష అడిగాడు. అంతేకాదు.. మెడలో QR కోడ్‌ను కూడా పెట్టుకున్నాడు.

మొదట్లో అతడికి పెద్దగా స్పందన రాలేదు. కొందరు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోగా, మరికొందరు తమకు తోచినంత సాయం చేశారు. తొలి కొన్ని గంటల్లో కేవలం రూ. 130 మాత్రమే సేకరించారు. ఒక భక్తుడు డిజిటల్ చెల్లింపు ద్వారా రూ. 40 కూడా అందించాడు. ఓ కళ్లద్దాల వ్యాపారి సచిన్‌కు ఒక జత కళ్లద్దాలను బహుమతిగా ఇచ్చాడు. మొదట సుమారు రూ. 2,000 వరకు వస్తుందని ఊహించినప్పటికీ.. 8 గంటలు పూర్తయ్యేసరికి మొత్తం రూ. 4,000 సేకరించడంతో యూట్యూబర్ ఆశ్చర్యపోయాడు. రోజుకు రూ. 4,000 వస్తే నెలకు రూ. 1.20 లక్షల వరకు ఆదాయం ఉంటుందనే లెక్క కూడా వేశారు.

అయితే ఈ ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భిక్షాటనలో కనిపించే ఆదాయం వెనుక ఉన్న పేదరికం, అవమానాలు, అసురక్షిత పరిస్థితులు, రోజువారీ కష్టాలను కేవలం ఒకరోజు ప్రయోగంతో అంచనా వేయలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us