అత్యంత ఖరీదైన ఆకుకూర చింతచిగురు.. ఆరోగ్య లాభాలు తెలిస్తే..
Jyothi Gadda
01 october 2026
మార్కెట్‌లో చింతచిగురుకు డిమాండ్ పెరిగి, దానికి అనుగుణంగా ధరలు కూడా ఆకాశాన్నంటి సామాన్యులకు అందుబాటులో లేని విధంగా అమాంతం పెరిగిపోయాయి.
రుచికరమైన చింతచిగురు పప్పు, రసం, చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్ వంటకాలలో దీనిని ప్రత్యేకం వాడటం వల్ల ఆహారప్రియులు ధర ఎక్కువైనా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
చింతచిగురులో శరీరానికి మేలు చేసే అనేక ఆయుర్వేద గుణాలు ఉండటంతో పాటు కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో ఇది ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇందులో ఉండే విటమిన్-సి స్కర్వీ వ్యాధిని నివారిస్తుందని, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం అందించడానికి బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
మధుమేహంతో బాధపడేవారు దీనిని ఆహారంలో భాగం చేసుకుంటే, అందులోని సహజ పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో తోడ్పడతాయి.
చర్మ సమస్యలు, దద్దుర్లు ఉన్నప్పుడు చింతచిగురు రసాన్ని రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుందని, అలాగే పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి, నాణ్యత పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
రక్తహీనత, నీరసం తగ్గించడంతో పాటు మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను అడ్డుకునే సామర్థ్యం చింతచిగురు రసంలో ఉందని పలు అధ్యయనాలు, ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కోత కోయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని కావడం, మార్కెట్‌కు పరిమిత పరిమాణంలో మాత్రమే సరఫరా రావడం వల్లనే వ్యాపారులు దీని ధరను విపరీతంగా పెంచేస్తున్నారని తెలుస్తోంది.