బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న సామాన్యుడి.. అకౌంట్‌లోని డబ్బు చూడగా స్టన్.. చివరికి..

అప్పుడప్పుడూ మనం పడే అత్యాశే.. మనకు చాలా కష్టాలను తెచ్చిపెడుతుందని పెద్దలు అంటుంటారు. సరిగ్గా దీనికి అడ్డం పట్టే..

బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న సామాన్యుడి.. అకౌంట్‌లోని డబ్బు చూడగా స్టన్.. చివరికి..
Money In Account
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2022 | 8:22 PM

అప్పుడప్పుడూ మనం పడే అత్యాశే.. మనకు చాలా కష్టాలను తెచ్చిపెడుతుందని పెద్దలు అంటుంటారు. సరిగ్గా దీనికి అడ్డం పట్టే విధంగా ఓ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇది కొంచెం మీకు వినడానికి నమ్మశక్యం కాకపోయినప్పటికీ.. ఇది నిజం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కపుల్ కొత్త ఇంటిని కొనుగోలు చేసి.. అందుకు సంబంధించిన డబ్బు రూ. 6 కోట్లు అమ్మకందారులు పంపాలని ప్రయత్నించింది. అయితే వారు పొరపాటున అమ్మకందారుల అకౌంట్‌కు డబ్బును పంపాల్సింది పోయి.. మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. సీన్ కట్ చేస్తే..

ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన 24 ఏళ్ల అబ్డెల్ ఘడియా అనే వ్యక్తి ఫోన్‌కు ఓ ఉదయం ఒక మెసేజ్ వచ్చింది. రూ. 6 కోట్లు అకౌంట్‌లో జమ అయ్యాయన్నది దాని సారాంశం. ఇంకేముంది ఎవరు వేశారో ఆ డబ్బు తెలియదు.. ఎలా వచ్చిందో తెలియదు.. అంతే! మనోడికి ఎక్కడలేని అత్యాశ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు రూ. 5 కోట్లు పెట్టి బంగారం కొనుగోలు చేశాడు. అలాగే రూ. 90 వేలతో షాపింగ్ చేశాడు. ఇక మిగిలిన డబ్బును విత్ డ్రా చేసి బయటకు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ. 6 కోట్ల డబ్బును ఊడ్చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడే సీన్‌లో ట్విస్ట్ వచ్చింది. అతడి ఖాతాలో అంత మొత్తంలో డబ్బు జమ అయినట్లుగా వార్త బయటకు రావడంతో సరాసరి జైలుకెళ్లాడు. ఖాతాలో పడిన డబ్బును స్వాహా చేసినందుకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.