Viral Video: ఆపిల్ సంస్థలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగి.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ
మార్కోస్ ఆపిల్ కంపెనీలో మానవ ఇంటర్‌ఫేస్ డిజైనర్. అతను అక్టోబర్ 28 న ఆపిల్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు అతను కంపీనీకి ఇచ్చిన సేవలకు గాను.. అతనికి కంపెనీ సీఈఓ టిమ్ కుక్ నుండి ప్రత్యేక బహుమతినిచ్చాడు. మార్కోస్ ఈ బహుమతి ఫోటోను .. గిఫ్ట్ అన్‌బాక్సింగ్ వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
చాలా సంవత్సరాలు ఒకే కంపెనీలో ఉండటం అందరికీ సాధ్యం కాదు. అయితే ఎవరైనా సరే తాము పనిచేస్తున్న కంపెనీ పట్ల విధేయతతో ఉంటే.. మీ కృషికి, అంకితభావానికి తగిన ప్రతిఫలం కూడా పొందవచ్చు. యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీ తన సుదీర్ఘ సేవలందిస్తున్న ఉద్యోగులకు రివార్డులు ఇస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇటీవల మార్కోస్ అలోన్సో అనే వ్యక్తి ఆపిల్ సంస్థలో తన 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. టెక్ దిగ్గజం నుండి తనకు లభించిన బహుమతికి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియోను అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది క్షణంలో వైరల్‌గా మారింది.
మార్కోస్ ఆపిల్ కంపెనీలో మానవ ఇంటర్‌ఫేస్ డిజైనర్. అతను అక్టోబర్ 28 న ఆపిల్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు అతను కంపీనీకి ఇచ్చిన సేవలకు గాను.. అతనికి కంపెనీ సీఈఓ టిమ్ కుక్ నుండి ప్రత్యేక బహుమతినిచ్చాడు. మార్కోస్ ఈ బహుమతి ఫోటోను .. గిఫ్ట్ అన్‌బాక్సింగ్ వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. గిఫ్ట్ బాక్స్ తెరిచిన వెంటనే అతనికి మొదటగా కనిపించింది ప్రింట్ చేయబడిన కార్డు – 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు అని వీడియోలో చూడవచ్చు. దీంతో పాటు అతని అంకితభావాన్ని ప్రశంసించారు. ఇప్పుడు అతని గిఫ్ట్.. అందుకు సంబంధించిన ప్రత్యేకత తెరపైకి వచ్చింది.
ఇక్కడ చూడండి
10 years at Apple pic.twitter.com/YYQNMzCBgx
— Marcos Alonso (@malonso) October 28, 2023
ఇప్పుడు యాపిల్ ఉద్యోగి మార్కోస్ చేసిన ఈ పోస్ట్ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. వార్తలు రాసే సమయానికి ఈ వీడియో 6 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
బహుమతి ఒక ఘన మెటల్ సావనీర్.. ఇది అల్యూమినియంతో తయారు చేయబడింది. మధ్యలో ఆపిల్ లోగో ఉంది. ఇది కాకుండా మెమెంటోపై మార్కోస్ పేరు.. 10 సంవత్సరాలు పూర్తి చేసిన తేదీ వ్రాయబడింది. బహుమతి ప్యాకేజింగ్ ఆపిల్ కి చెందిన వస్తువు వలె ఉంది. అదే సమయంలో ఇది ప్రత్యేకత కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..