AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షోలో అక్షయ్ హీరోయిజం.. నువ్వు రియల్ హీరో బాసూ..

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సామాజిక సేవ చేయడంలో ఈ హీరో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. కాగా తాజాగా మరోసారి తాను రియల్ లైఫ్ హీరో అని నిరూపించుకున్నాడు ఈ కిలాడీ. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం హౌస్‌ఫుల్ 4 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఓ కామెడీ షోకు ఆయన వెళ్లారు. అక్కడ అక్షయ్ కోసం షో నిర్వాహకులు […]

షోలో అక్షయ్ హీరోయిజం.. నువ్వు రియల్ హీరో బాసూ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 05, 2019 | 5:42 PM

Share

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సామాజిక సేవ చేయడంలో ఈ హీరో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. కాగా తాజాగా మరోసారి తాను రియల్ లైఫ్ హీరో అని నిరూపించుకున్నాడు ఈ కిలాడీ. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం హౌస్‌ఫుల్ 4 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఓ కామెడీ షోకు ఆయన వెళ్లారు. అక్కడ అక్షయ్ కోసం షో నిర్వాహకులు స్టంట్స్ చేయించేందుకు ఆర్టిస్ట్‌లను పెట్టించారు. ఈ క్రమంలో ఓ ఆర్టిస్ట్ స్టంట్ చేయాల్సి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో అక్షయ్ వెంటనే అతన్ని కాపాడేందుకు వెళ్లారు. ఆర్టిస్ట్‌ను జాగ్రత్తగా కిందకి దింపి.. పూర్తిగా కోలుకునేవరకు ఎలాంటి స్టంట్స్ చేయించవద్దని షో నిర్వాహకులను హెచ్చరించారు.

ఆ సమయంలో తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అక్షయ్ సర్ మీరు రియల్ లైఫ్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో యాక్షన్ స్టంట్స్‌కు అక్షయ్ పెట్టింది పేరు. ఆయన్ను ఇంప్రెస్ చేసేందుకు ఆ వ్యక్తి ముందు రోజు స్టంట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల నీరసించిపోయాడు. దీంతో షోలో స్టంట్స్ చేస్తున్న సమయంలో పడిపోయాడు. కాగా తన కోసం రిస్కీ స్టంట్స్ చేయాలనుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఏదన్నా సాయం కావాలన్నా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని అక్షయ్ తెలపడం విశేషం.

Follow Us
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..