AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? ఈ ట్రిక్స్ పాటిస్తే మోసాలకు చెక్..

ఎంత పెట్రోల్ కొట్టించినా.. మైలేజ్ అస్సలు రావడం లేదు.. అని చాలా మంది అంటుంటారు. అయితే మీ బండిలో కాకుండా పెట్రోల్ బంకుల్లోనే ఏదో తేడాలు జరిగి ఉండొచ్చు. మనం బంకుకు వెళ్లినప్పుడు ఫోన్లలో మునిగిపోవడమో లేదా పక్కకు చూడటమో చేస్తుంటాం. సరిగ్గా ఈ చిన్న నిర్లక్ష్యాన్నే ఆసరాగా చేసుకుని, కొందరు సిబ్బంది మనల్ని నిలువునా ముంచేస్తున్నారు.

పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? ఈ ట్రిక్స్ పాటిస్తే మోసాలకు చెక్..
How To Avoid Petrol Pump Cheating
Krishna S
|

Updated on: Jun 18, 2026 | 8:54 PM

Share

వాహనంలో ఫుల్‌గా పెట్రోల్ కొట్టించినా.. మైలేజ్ రావడం లేదని లేదా ట్యాంక్ త్వరగానే ఖాళీ అయిపోతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీరు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల బారిన పడి ఉండవచ్చు. బంకుల్లోని సిబ్బంది మీ కళ్లు కప్పి చాలా సులువుగా పెట్రోల్ చోరీకి పాల్పడుతుంటారు. ఇలాంటి ఇంధన స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ డబ్బును ఆదా చేసుకోవడానికి నిపుణులు కొన్ని సింపుల్ ట్రిక్స్ సూచించారు. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రౌండ్ ఫిగర్ వద్దు

చాలామంది వాహనదారులు బంకుకు వెళ్లినప్పుడు రూ.100, రూ.200, రూ.500 లేదా రూ.1000 అంటూ రౌండ్ ఫిగర్‌తో పెట్రోల్ కొట్టిస్తారు. అయితే కొన్ని బంకుల్లోని మిషన్లలో ఈ రౌండ్ ఫిగర్ నంబర్లకు ముందే చిప్స్ లేదా కోడ్‌ల ద్వారా రీడింగ్ సెట్ చేసి ఉంచుతారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల మీకు డబ్బుకు తగ్గ పెట్రోల్ రాదు. అందుకే ఇకపై ఇంధనం నింపేటప్పుడు రూ.101, రూ.204, రూ.509 లేదా రూ.1005 తో చెప్పి పెట్రోల్ పోయించుకోండి. దీనివల్ల మోసపోయే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

0 రీడింగ్ చూశాకే పెట్రోల్ కొట్టించండి

పెట్రోల్ బంకు సిబ్బంది మీ వాహనం ట్యాంకులో పైప్ పెట్టకముందే డిజిటల్ స్క్రీన్‌పై 0.00 రీడింగ్ ఉందో లేదో ఖచ్చితంగా గమనించాలి. కొన్నిసార్లు సిబ్బంది మీ దృష్టిని మళ్లించి, అంతకుముందు వాహనదారుడు కొట్టించిన రీడింగ్ నుండే ఇంధనాన్ని కొనసాగిస్తారు. దీనివల్ల మీకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది.

మీ దృష్టి కేవలం మీటర్ పైనే ఉండాలి

మీరు బంకులో ఉన్నప్పుడు మీ పూర్తి దృష్టి కేవలం రీడింగ్ మీటర్, నోజిల్ పైనే ఉండాలి. అక్కడ సిబ్బంది మాట్లాడే మాటలకు లోనవ్వడం, ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉండటం లేదా అటుఇటూ చూడటం వంటివి చేస్తే వారు సులువుగా మిమ్మల్ని మోసం చేస్తారు. ఒకవేళ మీటర్ రీడింగ్ సాధారణం కంటే చాలా వేగంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే ఏదో గందరగోళం ఉందని గ్రహించాలి.

ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ శాఖ సీల్స్

ప్రతి పెట్రోల్ బంక్ మెషీన్, నోజిల్‌పై ప్రభుత్వ తూనికలు, కొలతల శాఖ వారి అధికారిక సీల్ ఉండాలి. ఒకవేళ ఈ సీల్స్ విరిగిపోయి ఉన్నా లేదా అనుమానాస్పదంగా అనిపించినా ఆ మెషీన్ సెట్టింగ్స్‌తో ఏదో తేడా చేశారని అర్థం చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ హ్యాకింగ్ ద్వారా స్క్రీన్‌పై నంబర్లు సరిగ్గా కనిపించినా, లోపల తక్కువ ఇంధనం పడేలా మేగ్నెటిక్ చిప్స్ అమర్చే ముఠాలు కూడా ఉంటాయి. అవాంతర లేదా నమ్మకం లేని ప్రైవేట్ బంకుల కంటే.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి పేరున్న భరోసా కలిగిన ప్రభుత్వ బంకుల్లో పెట్రోల్ నింపుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం. అక్కడ నాణ్యత, పరిమాణాల నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.

Follow Us
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!
రూ. 4 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కారు కావాలా? మైలేజ్‌లో రికార్డు
రూ. 4 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కారు కావాలా? మైలేజ్‌లో రికార్డు
కొత్త హోండా ఎలివేట్‌లో కనిపించిన మార్పులివే
కొత్త హోండా ఎలివేట్‌లో కనిపించిన మార్పులివే
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్