AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వార్నీ ఎంత పని చేశావురా బుడ్డోడా..! దెబ్బకు అమ్మ నవ్వు సెకన్లలో మాయం..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఓ తల్లి, ఆమె చిన్నారి మధ్య జరిగిన ఈ సరదా ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Watch Video: వార్నీ ఎంత పని చేశావురా బుడ్డోడా..! దెబ్బకు అమ్మ నవ్వు సెకన్లలో మాయం..!
Child Tosses Mom Iphone Into Lake
Balaraju Goud
|

Updated on: Jun 18, 2026 | 8:18 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఓ తల్లి, ఆమె చిన్నారి మధ్య జరిగిన ఈ సరదా ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన చిన్న బిడ్డతో కలిసి సరస్సులో పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు ఉండటంతో ఆమె ఎంతో సంతోషంగా గడుపుతోంది. తన చేతిలో ఉన్న ఐఫోన్‌తో వీడియోలు తీసుకుంటూ ఆ క్షణాలను ఆస్వాదిస్తోంది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకుంది.

మహిళ చేతిలో ఉన్న ఐఫోన్‌ను ఆమె చేతిలోని చిన్నారి అకస్మాత్తుగా లాక్కున్నాడు. మొదట తల్లి అది సరదాగా ఆడుకుంటున్నాడని భావించింది. అయితే క్షణాల్లోనే ఆ చిన్నారి ఎలాంటి ఆలోచన లేకుండా ఆ ఖరీదైన ఐఫోన్‌ను నేరుగా సరస్సులోకి విసిరేశాడు. ఫోన్ నీటిలో పడిపోవడంతో తల్లి ముఖంలో ఉన్న చిరునవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. ఆనందం స్థానంలో షాక్, నిరాశ, నిస్సహాయత కనిపించాయి.

ఈ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, ఫోన్ నీటిలో పడే ముందు, తర్వాత తల్లి ముఖ కవళికల్లో వచ్చిన మార్పు. మరోవైపు, తన వల్ల ఏం జరిగిందో కూడా తెలియనట్టుగా ఆ చిన్నారి ప్రశాంతంగా కూర్చోవడం నెటిజన్లను మరింత నవ్విస్తోంది. వీడియోను షేర్ చేసిన వ్యక్తి స్లో-మోషన్ వెర్షన్‌ను కూడా జత చేయడంతో ఈ దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ వీడియోను @yajnshri అనే అకౌంట్ ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు సరదా స్పందనలు చేస్తున్నారు. “పిల్లాడికి ఐఫోన్ విలువ తెలియదు”, “అది సరస్సుకు ఇచ్చిన గిఫ్ట్” అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వుల వర్షం కురిపిస్తోంది.

ఫన్నీ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...