AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలుత వారి అకౌంట్లోకే డబ్బులు!

వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవ్వడంలో రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈ సారి కూడా ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోనే ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.

Rythu Bharosa: రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలుత వారి అకౌంట్లోకే డబ్బులు!
Rythu Bharosa Eligible Farmers List
Anand T
|

Updated on: Jun 19, 2026 | 10:57 AM

Share

వర్షాకాలం సీజన్ స్టార్ట్ కావడంతో రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో జూన్ 30వ తేదీన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మధిరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

అయితే నిధుల పంపిణీలో ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యేందుకు అధికారులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. పెట్టుబడి సాయం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియను మొత్తం మూడు దశలుగా విభజించి నిధులు విడుదల చేయనున్నారు. ఇది ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు.

తొలి విడతలో వీరికే నిధులు:

అయితే తొలి దశలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. అంటే కేవలం ఎకరం లేదా ఎకరం లోపల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా నిధులు జమ చేయనుంది. ఇక రెండో విడతలో భాగంగా.. రెండు ఎకరాల సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఇక చివరిగా మూడో విడతలో రెండు నుంచి ఐదు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రైతు భరోసా FAQ..

  • ప్రశ్న 1: ఏడాదిలో ప్రభుత్వం ఎన్ని సార్లు రైతు భరోసా నిధులను ఇస్తుంది? జావాబు: ఏడాదికి రెండు విడతల్లో వానాకాలం, యాసంగి సీజన్లకు రైతు భరోసా నిధులను ఇస్తుంది.
  • ప్రశ్న 2: ఈ పథకానికి అర్హులు ఎవరు? జవాబు: రాష్ట్రంలోని అర్హులైన సన్న, చిన్నకారు, ఐదు ఎకరాల లోపు సాగు భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు.
  • ప్రశ్న 3: ఈ విడతలో గరిష్టంగా ఎన్ని ఎకరాలు ఉన్న వారి వరకు నిధులు వేస్తారు? జవాబు: ఈ విడతలో మూడు దశల వారీగా గరిష్టంగా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేస్తారు.
  • ప్రశ్న 4: మొదటి దశలో ఏ రైతులకు నిధులు అందుతాయి? జావాబు: మొదటి దశలో జూన్ 30న కేవలం ఎకరం లేదా ఎకరం లోపు భూమి ఉన్న చిన్న రైతులకు ముందుగా నిధులు అందుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us