AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన పసి ప్రాణం!

అమ్మ ఒడిలో వెచ్చగా పెరగాల్సిన ఏడు రోజుల పసివాడు ఒంగోలు నగరంలోని గాంధీనగర్‌లో ముళ్లపొదల్లో మృతదేహంగా కనిపించడం స్థానికులను కలచివేసింది. శిశువు మరణానంతరం అక్కడ పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన పసి ప్రాణం!
Seven-Day-Old Infant Found Dead in Thorn Bushes
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 10:40 AM

Share

అమ్మ పొత్తిళ్ళల్లో వెచ్చగా ఎదగాల్సిన పసివాడు ముళ్ళపొదల్లో విగతజీవిగా కనిపించాడు. ఒంగోలు నగరంలోని గాంధీనగర్‌లో ఓపీఎస్‌ స్కూలు ఎదురుగా ఉన్న ముళ్ళపొదల్లో పసికందును పారేసి వెళ్ళిపోయారు. ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. శిశువు మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

ఒంగోలు పట్టణంలోని గాంధీ నగర్‌లోని ఓపీఎస్ స్కూల్ ఎదురుగా శివారు ప్రాంతంలో ముళ్ళపొదల్లో ఏడు రోజుల మగ శిశువు చనిపోయి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన దినేష్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని జిల్లా మహిళా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగమణి సూచన ప్రకారం జిల్లా బాలల సంక్షేమ కమిటీ, తాలూకా పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తకి సమాచారం అందించారు. శిశువు మృతి చెందిన తరువాత పారేసినట్టు అనుమానిస్తున్నారు. మగ శిశువుగా ఉన్న పసికందును ఎవరు పారవేశారు. అక్రమ సంతానమా, లేక అనారోగ్యంతో మరణించాడా..? అనే విషయాన్ని విచారిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ హాస్పటల్‌కు తరలించి పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలియచేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్త అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా ఎస్సై పి. చౌడయ్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Follow Us