AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళసూత్రంలో నల్లపూసలు ఎందుకు ఉంటాయో తెలుసా..? వాటి వెనుక ఉన్న రహస్యాలు ఇవే..

ముక్కోటి దేవతల సాక్షిగా వరుడు వధువులో మెడలో కట్టే మంగళసూత్రం కేవలం ఒక బంగారు ఆభరణం మాత్రమే కాదు. అది నూరేళ్ల వైవాహిక బంధానికి, నిండైన సౌభాగ్యానికి నిదర్శనం. అయితే మంగళసూత్రంలో నల్లపూసలను ఎందుకు గుచ్చుతారు? కేవలం అందం కోసమేనా.. లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అనే విషయాలు తెలుసుకుందాం..

మంగళసూత్రంలో నల్లపూసలు ఎందుకు ఉంటాయో తెలుసా..? వాటి వెనుక ఉన్న రహస్యాలు ఇవే..
Why Are Black Beads Used In MangalsutraImage Credit source: Giva
Krishna S
|

Updated on: Jun 18, 2026 | 9:20 PM

Share

హిందూ సంస్కృతిలో మంగళసూత్రానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. వివాహ సమయంలో వరుడు వధువు మెడలో కట్టే మంగళసూత్రం కేవలం ఒక బంగారు ఆభరణం మాత్రమే కాదు. అది వైవాహిక జీవితం, ప్రేమ, నమ్మకం, ఇద్దరి బంధం పవిత్రతకు ప్రతీక. అయితే మంగళసూత్రంలో బంగారంతో పాటు నల్లపూసలను ఎందుకు గుచ్చుతారు? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. సనాతన సంప్రదాయం ప్రకారం.. నలుపు రంగుకు ప్రతికూల శక్తులను, నజర్ లేదా చెడు దిష్టిని దూరం చేసే శక్తి ఉందని నమ్ముతారు. మంగళసూత్రంలో నల్లపూసలను గుచ్చడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఇదే. ఈ పూసలు వివాహిత స్త్రీని, ఆమె భర్తను, వారి కొత్త కుటుంబాన్ని ఎలాంటి చెడు శక్తుల ప్రభావం పడకుండా రక్షిస్తాయని నమ్ముతారు.

వైవాహిక బంధంలో స్థిరత్వం

ధార్మిక కోణంలో చూస్తే.. మంగళసూత్రం భార్యాభర్తల అతునాతన బంధానికి ప్రతీక. ఇందులో ఉండే నల్లపూసలు ఆ బంధంలో స్థిరత్వాన్ని, భద్రతను, సానుకూలతను నింపుతాయని పెద్దలు చెబుతారు. చాలా కుటుంబాలలో స్త్రీ మంగళసూత్రం ధరించడం వల్ల భర్తకు ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని బలమైన నమ్మకం ఉంది.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం.. ఈ నల్లపూసలు మనస్సులోని ప్రతికూల ఆలోచనలను, చుట్టుపక్కల ఉండే అసూయ, ద్వేషం వంటి దుష్ట శక్తులను గ్రహించి నశింపజేస్తాయి. పూర్వ కాలం నుండి కూడా స్త్రీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఈ నల్లపూసలు పనిచేస్తాయనే విశ్వాసంతోనే వీటిని మంగళసూత్రంలో భాగం చేశారు.

ప్రాంతాలు మారినా.. మారని సాంప్రదాయం

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, సంస్కృతులను బట్టి మంగళసూత్రం డిజైన్లు మారవచ్చు. కొన్ని చోట్ల పెద్ద బంగారు పెండెంట్లు ఉంటే, మరికొన్ని చోట్ల తాళిబొట్లు వేర్వేరు ఆకారాల్లో ఉంటాయి. కానీ డిజైన్ ఏదైనా సరే, అందులో నల్లపూసలు ఉండటం మాత్రం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపించే కామన్ సాంప్రదాయం.

మారుతున్న కాలం.. అస్సలు తగ్గని క్రేజ్

ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళల అభిరుచులకు అనుగుణంగా లైట్ వెయిట్, స్టైలిష్ మంగళసూత్రాల డిజైన్లు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. అయినప్పటికీ వాటి ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. నేటి తరం ఆధునిక మహిళలు కూడా మంగళసూత్రాన్ని ఒక ఫ్యాషన్ ఆభరణంలా కాకుండా తమ వైవాహిక బంధానికి ఉండే ఒక ఎమోషనల్, ఆధ్యాత్మిక కనెక్ట్ లా భావించి భక్తితో ధరిస్తున్నారు.

Follow Us