Trending Video: కట్టు కట్టిన కాలుతో డ్రైవింగ్.. ఆటోవాలా కష్టానికి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు.. వీడియో మీ కోసం..
జీవితం చాలా కఠినమైనది. కష్ట సుఖాలు లేని లైఫ్ ఉండదు. జీవితం అనేది అందరికీ పూలపాన్పు కాదు. కొందరికి ఆనందం కలిగిస్తే.. మరికొందరికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలే ఇందుకు...
జీవితం చాలా కఠినమైనది. కష్ట సుఖాలు లేని లైఫ్ ఉండదు. జీవితం అనేది అందరికీ పూలపాన్పు కాదు. కొందరికి ఆనందం కలిగిస్తే.. మరికొందరికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ సువిశాల ప్రపంచంలో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వారు తమతో ఉన్న వారిని పోషించుకునేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. ప్రమాదాలు ఎదురైనా వెనకాడరు. ఆరోగ్యం బాగా లేకున్నా, కుటుంబసభ్యులు ఆకలితో ఉండకుండా ఉండేందుకు.. ఇంటి యజమాని చాలా కష్టపడతాడు. విధి లేని పరిస్థితుల్లో తప్పక పనికి వెళ్తాడు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తాడు. మంచైనా.. చెడైనా వారితోనే. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటి వారి కథ ఎమోషనల్‌తో పాటు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి కాలుకు కట్టు కట్టుకుని ఆటో నడపడాన్ని చూడవచ్చు. వీడియో చూస్తుంటే.. అతని కాలికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా ప్లాస్టర్ చేసిన కాలితోనే ఆటో నడుపడం అతని ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే ఆదాయం రాదని, కుటుంబసభ్యులు ఆకలితో ఉండాల్సి వస్తుందని భావించి కట్టు కట్టిన కాలుతోనే ఆటో నడపుతున్నాడు. ఈ వీడియో నిజంగా హృదయాన్ని మెలిపెడుతోంది. అతని పరిస్థితిని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు.
बहाना बनाने वाले के लिए काम नहीं है और काम करने वाले के लिए बहाना नहीं है। pic.twitter.com/6yqoQgTbrc
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) January 7, 2023
ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘సాకులు చెప్పేవాడికి పని లేదు, పని చేసేవాడికి కారణం అక్కర్లేదు’ అనే క్యాప్షన్ తో వీడియోను పోస్ట్ చేశారు. కేవలం 12 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 7 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..