Telugu News Trending A video of a woman trying to feed sharks has gone viral on social media Telugu News
Video Viral: ఒడ్డుపై తల్లీ కుమారులు.. నీటిలో వేగంగా దూసుకువస్తున్న షార్క్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర జీవుల్లో షార్క్స్ (Sharks) ఒకటి. అందుకే సముద్రంలో ప్రయాణం చేసే వారు, చేపలు పట్టేవారు వీరి పట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాయో ఎవ్వరికీ తెలియదు....
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర జీవుల్లో షార్క్స్ (Sharks) ఒకటి. అందుకే సముద్రంలో ప్రయాణం చేసే వారు, చేపలు పట్టేవారు వీరి పట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. సొర చేపలు, షార్క్స్ మనుషులపై దాడి చేసిన ఘటనలు మనం చూశాం. కొన్నిసార్లు ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు మనం విన్నాం. అందుకే వాటికి దూరంగా ఉంటారు. ప్రస్తుతం అలాంటి ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ తన కుమారుడితో కలిసి షార్క్ కు మాంసం ముక్క తినిపించే ప్రయత్నం చేస్తారు. షార్క్ మాంసాహార జీవి కాబట్టి, మాంసం ముక్కను చూసిన వెంటనే అది వారి వద్దకు వస్తుంది. షార్క్ వారి దగ్గరికి వచ్చిన సమయంలో తల్లీ బిడ్డలు బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో ఉన్న షార్క్ పై పడిపోతారు. అదే సమయంలో షార్క్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 13 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 23 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్ల చేస్తున్నారు. చిన్న షార్క్ ప్లేస్ లో పెద్ద షార్క్ ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదకర సాహసాలు చేయవద్దని కామెంట్ల రూపంలో నెటిజన్లు సూచిస్తున్నారు.