Telugu News Trending A video of a horse falling down due to the summer heat has gone viral on social media Telugu viral News
Viral Video: గుక్కెడు నీళ్ళకోసం అల్లాడి.. చివరికి రోడ్డుపైనే కుప్పకూలి.. కలచివేస్తున్న వీడియో
భూమిపై నివసించే సమస్త ప్రాణకోటికి నీరు అత్యంతావశ్యకం. ప్రతి జీవికీ నీటి అవసరం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. వేసవిలో (Summer) చుక్క నీరూ దొరకక అనేక మూగజీవులు ప్రాణాలు కోల్పోతుంటాయి. తాజాగా ఓ గుర్రం వేసవి తాపాన్ని తాళలేక...
భూమిపై నివసించే సమస్త ప్రాణకోటికి నీరు అత్యంతావశ్యకం. ప్రతి జీవికీ నీటి అవసరం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. వేసవిలో (Summer) చుక్క నీరూ దొరకక అనేక మూగజీవులు ప్రాణాలు కోల్పోతుంటాయి. తాజాగా ఓ గుర్రం వేసవి తాపాన్ని తాళలేక బండిని లాగుతూనే కుప్పకూలిపోయింది. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఈ ఘటన హృదయాలను కలచివేస్తుంది. న్యూయార్క్ (New York) లోని మాన్‌హట్టన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలో క్యారేజ్ లాగుతున్న రైడర్ అనే గుర్రం ఉన్నట్టుండి కిందపడిపోయింది. దానిని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పశువుల వైద్యుల్ని, పోలీసులకు సమాచారం అందించారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అశ్వదళం యూనిట్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక రోడ్డుపై పడిపోయిన ఆ గుర్రానికి చికిత్స అందించారు. పైపులతో నీటిని వెదజల్లారు. కొంత సమయం తర్వాత ఆ గుర్రం కోలుకుని పైకి లేచింది. పోలీసులు దానిని గుర్రపుశాలకు తరలించారు. పశు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
BREAKING: This horse COLLAPSED while pulling a carriage in NYC, likely from heat exhaustion, and has been down for over an hour.
కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు ప్రేమికులు గుర్రం బండి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్రపుబండ్ల స్వారీని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్లు, మనుషులు, వాతావరణంతో పాటు మరెన్నో కారణాల వల్ల గుర్రాలు ప్రమాదానికి గురవుతాయని పెటా సంస్థ ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.