Trending Video: భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా.. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఇంటర్నెట్ అనేది విశ్వవ్యాప్తం. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రపంచంలోని అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు, అపరిమిత డేటా ప్లాన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి...

ఇంటర్నెట్ అనేది విశ్వవ్యాప్తం. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రపంచంలోని అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు, అపరిమిత డేటా ప్లాన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత అధికమైంది. దీంతో ప్రజలు తమలో ఉన్న ట్యాలెంట్ ను బయట పెట్టేందుకు సామాజిక మాధ్యమాలను ఓ వేదికగా ఎంచుకుంటున్నారు. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్.. ఇలా అది ఇదీ అనే తేడా లేకుండా సమస్తం ఫోన్ లోనే అయిపోయాయి. అంతే కాకుండా ఇలా చేస్తున్న వారు ఫేమస్ కూడా అవుతున్నారు. ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లైతే.. పాకిస్తానీ వైరల్ గర్ల్ అయేషా గురించి తెలుసుకోవాలి. ఒక పాట, ఆమె వేసే స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓ పెళ్లికూతురు వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మండపానికి వెళ్లే ముందు ఫేమస్ అయిన ఈ పాటపై వీడియోను చిత్రీకరిస్తోంది. అయితే ఆ సమయంలో ఆమె ఊహించని ఇన్సిడెంట్ జరిగింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వధువు భారీ లెహంగా వేసుకుని ఉండటాన్ని చూడవచ్చు. ఆమె పాటకు డ్యాన్స్ వేస్తున్న సమయంలో లెహెంగా బరువు తట్టుకోలేక కింద పడిపోతుంది. ఈ వీడియో చూసేందుకు ఫన్నీగా అనిపించినప్పటికీ.. ఇబ్బంది కలిగించే దుస్తులు ధరించకూడదు అనే విషయాన్ని తెలుపుతుంది. పెళ్లి రోజు ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరూ ఈ క్షణాన్ని తమ కెమెరాలో బంధించాలని కోరుకుంటారు. కానీ అన్ని సార్లు తాము అనుకున్నది కచ్చితంగా కుదరదని, అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని ఈ వీడియో తెలుపుతోంది.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..