Snake Video: ఏం గుండెరా సామీ నీది.. ఆరు అడుగుల పాముతో ఆటలు.. ఎంచెక్కా లుంగీలో వేసుకుని..

ప్రస్తుతం పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఆరడుగుల పాముతో ఆడుకోవడమే కాకుండా, ఏ మాత్రం భయంలేకుండా లుంగీలో వేసుకుని హాయిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Snake Video: ఏం గుండెరా సామీ నీది.. ఆరు అడుగుల పాముతో ఆటలు.. ఎంచెక్కా లుంగీలో వేసుకుని..
Snake Catch
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2022 | 8:38 AM

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి పేరు వింటేనే చాలామంది కంగారు పడిపోతారు. ఇక అనుకోకుండా ఎప్పుడైనా విషసర్పాలు తారసపడితే అంతే సంగతులు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. బతికున్న పాముల సంగతి పక్కన పెడితే.. కనీసం చనిపోయిన పాముల దగ్గరికి కూడా వెళ్లరు చాలామంది. ప్రపంచంలో 2 వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయంటారు. అయితే అన్నీ పాములు విషపూరితమైనవి కావు. కొన్ని పాముల్లో మాత్రమే విషం ఉందని, అలాంటి పాములకు దూరంగా ఉండటం మంచిది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విషపూరిత పాముతో ఆడుకోవడమే కాకుండా, ఏ మాత్రం భయంలేకుండా లుంగీలో వేసుకుని హాయిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. ఒక యూజర్‌ తిరిగి ఈ వీడియోను నెట్టింట్లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. సదరు వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియోలో మొదట ముగ్గురు విదేశీయులు పామును పట్టుకోవడం మనం చూడవచ్చు. ఇద్దరు వ్యక్తులు చేతిలో గోనె పట్టుకొని ఉండగా, మూడో వ్యక్తి పామును పట్టుకుని గోనె సంచిలో వేసేందుకు ప్రయత్నిస్తాడు. దీని తరువాత మరొక సన్నివేశంలో ఒక లుంగీ కట్టుకున్న వ్యక్తి విషపూరిత పాముతో ఆటలాడుకుంటుంటాడు. ఆరు అడుగుల పామును తన చేతులతో అవలీలగా ఆడించాడు. పాము అతన్ని కాటేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి చిక్కకుండా భలే తప్పించుకున్నాడు. చివరికి పామును తను కట్టుకున్న లుంగీలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. @HasnaZarooriHai అనే ఐడీతో ట్విట్టర్‌లో ‘వరల్డ్ వర్సెస్ ఇండియా’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్‌ చేశారు. దీనిని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. కేవలం 43 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. అలాగే వేలాది కామెంట్లు, వందలాది లైకులు వచ్చాయి. ‘ఇతనిది ఏం గుండెరా సామీ’, ‘వీడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ ‘ఇది భారతీయులకు మాత్రమే సాధ్యం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..