Video Viral: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. సైకిల్ నే బుల్లెట్ గా మార్చేశారు.. నెటిజన్లు కామెంట్లు చూస్తే..

ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ లేదు. తమలో దాగి ఉన్న నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇలా ట్యాలెంట్ ఉన్న చాలా మంది ప్రపంచం దృష్టిలో పడ్డారు. వైరల్ గా మారారు..

Video Viral: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. సైకిల్ నే బుల్లెట్ గా మార్చేశారు.. నెటిజన్లు కామెంట్లు చూస్తే..
Bullet Bike Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 03, 2023 | 7:08 AM

ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ లేదు. తమలో దాగి ఉన్న నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇలా ట్యాలెంట్ ఉన్న చాలా మంది ప్రపంచం దృష్టిలో పడ్డారు. వైరల్ గా మారారు. సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇండియన్స్ విషయంలో ట్యాలెంట్ అణువణువునా దాగి ఉంది. వారితో ఎవరూ పోటీ పడలేరు. తాము చేసే ప్రతి పనిలో మ్యాజిక్ ను కనుగొంటారు. సైకిల్‌ను బైక్‌గా మార్చాలన్నా, బైక్‌ను సైకిల్‌గా మార్చాలన్నా.. భారతీయులు తమ జుగాడ్ ద్వారా ఈ పనిని త్వరగా చేయగలరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది.

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ పై ప్రయాణిస్తున్నట్లు కనిపించినా.. ఆ బుల్లెట్‌ను సైకిల్‌ స్టైల్‌లో నడపడం ఆశ్చర్యకరం. సైకిల్ ను బుల్లెట్ గా మార్చి పెడల్ సహాయంతో తొక్కుతూ ముందుకు కదిలిపోతున్నారు. పెట్రోల్ లేకుండా హాయిగా తొక్కుతూ వెళ్లిపోతున్నారు. సైకిల్ నడుపుతున్న వ్యక్తి వెనుక మరో వ్యక్తి కూర్చుని ఉండటం విశేషం. ఈ వీడియో చూసిన తర్వాత భారతీయులు దేనినీ వృధా చేయనివ్వరని, బదులుగా వారు దానికి మ్యాజిక్ చేసి ఉపయోగకరంగా మారుస్తారని నిరూపితమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 22 మిలియన్ల కంటే ఎక్కువ.. అంటే 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. 20 లక్షల మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా రకరకాల ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..