Samosa: 12 కిలోల బాహుబలి సమోసా.. తిన్నారంటే రూ.71 వేలు మీ సొంతం

చిరుతిళ్లలో సమోసాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బయటకి వెళ్లినప్పుడు చాలామంది సమోసాలను ఇష్టంగా తింటుంటారు. మాములుగా అయితే హోటల్స్‌లో చిన్న చిన్న సమోసాలు మనకు కనిపిస్తాయి. మరీ ఎప్పుడైన 12 కిలోల సమోసాను చూశారా ? వామ్మో అంత పెద్ద సమోసా ఏంటి అని అనుకుంటున్నారా.

Samosa: 12 కిలోల బాహుబలి సమోసా.. తిన్నారంటే రూ.71 వేలు మీ సొంతం
Bahubali Samosa
Follow us
Aravind B

|

Updated on: Jun 18, 2023 | 7:54 PM

చిరుతిళ్లలో సమోసాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బయటకి వెళ్లినప్పుడు చాలామంది సమోసాలను ఇష్టంగా తింటుంటారు. మాములుగా అయితే హోటల్స్‌లో చిన్న చిన్న సమోసాలు మనకు కనిపిస్తాయి. మరీ ఎప్పుడైన 12 కిలోల సమోసాను చూశారా ? వామ్మో అంత పెద్ద సమోసా ఏంటి అని అనుకుంటున్నారా. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన శుభం కౌషల్ అనే స్వీట్ షాపు యజమాని 12 కిలోల బరవున్న సమోసాను తయారు చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. అంతేకాదండోయ్.. ఈ సమోసాను 30 నిమిషాల్లో తిన్నవారికి ఏకంగా రూ.71 వేలు నగదు బహుమతి ఇస్తానని కూడా ప్రకటించాడు.

తమ షాప్‌లో తయారుచేసే సమోసాలను వెలుగులోకి తీసుకురావడానికి ఏదైన కొత్తగా చేయాలని గతంలో అనిపించినట్లు శుభం కౌషల్ తెలిపాడు. చివరికి బాహుబలి సమోసాలు తయారు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. మొదటగా 4 కేజీల సమోసా తయారు చేశామని.. ఆ తర్వాత 8 కేజీల సమోసా తయారు చేశామన్నాడు. ఇవి రెండు కూడా పాపులర్ కావడంతో 12 కేజీల సమోసా తయారు చేశామని తెలిపాడు. స్థానికులతో పాటు చాలామంది సోషల్ మీడియా ప్రముఖులు, ఫుడ్ వ్లాగర్లు కూడా తమ షాప్‌కు తరచుగా వస్తారని చెప్పాడు. ఈ 12 కిలోల సమోసా ధర రూ.1500 ఉంటుందని.. ఇప్పటివరకు తమకు 40 నుంచి 50 ఆర్డర్లు కూడా వచ్చాయన్నాడు. అలాగే ఈ సమోసాను తయారుచేసేందుకు దాదాపు 6 గంటల వరకు సమయం పడుతుందని. దేశంలోకెల్లా అతిపెద్ద సమోసా ఇదేనని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..