ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లోకి ప్రవేశించిన కోతి.. నేరుగా ప్రిన్సిపాల్ రూమ్‌లోకి వెళ్లింది. అయితే, గదిలో ప్రిన్సిపాల్ లేకపోవడంతో.. ఆయన కూర్చునే సీట్‌పై ఆ కోతి కన్నుపడింది. ఇంకేముంది.. వెంటనే ఆ కూర్చీలో పాగా వేసింది. అంతలోనే గదిలోకి వచ్చిన ప్రిన్సిపాల్ కోతిని చూసి అవాక్కయ్యాడు. ఆ కోతిని పంపేందుకు ప్రయత్నించగా.. అదికాస్తా మొండికేసింది. అక్కడి నుంచి లేచేదే లేదన్నట్లుగా ప్రవర్తించింది. దాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని మొదట భయపెట్టించింది. ఆ తరువాత దానంతట అంతే అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, కోతి ఆ సీట్‌లో కూర్చోగా.. పాఠశాల సిబ్బంది దానిని వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. కోతి వేశాలు మామూలుగా లేవంటున్నారు.
Viral Video:
Also read:
Tamil Nadu Lockdown: కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగింపు..
China: చైనా నక్కచిత్తులు..ఆర్మీలో ఇంటికి ఉద్యోగం పేరిట టిబెటన్లకు గాలం..