Tea Party: గిన్నిస్ రికార్డులకెక్కిన టీ పార్టీ… నెట్టింట వైరల్ అవుతున్న వీడియో స్పెషల్ ఏంటో తెలుసా..!
Tea Party: ప్రపంచ వ్యాప్తంగా తేనీరు ప్రేమికులు రికార్డ్ స్థాయిలో ఉన్నారు. కొంతమంది అయితే అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ.. టీ తాగకుండా ఉండలేరు. అంతగా మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది టీ. పార్టీల్లో,..
Tea Party: ప్రపంచ వ్యాప్తంగా తేనీరు ప్రేమికులు రికార్డ్ స్థాయిలో ఉన్నారు. కొంతమంది అయితే అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ.. టీ తాగకుండా ఉండలేరు. అంతగా మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది టీ. పార్టీల్లో, ఫంక్షన్లలో సమాయనుకులంగా టీ తప్పనిసరిగా ఉండాల్సిందే.. అయితే సాధారణంగా టీ పార్టీ అంటే ఎక్కడ చేసుకుంటాం… సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ మంచి ప్లేస్‌లో ఏర్పాటు చేసుకుంటాం.లేదంటే మంచి హోటల్‌కు వెళ్లి తాగుతాం. అందుకు మహా అంటే ఓ రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించి వెళ్తాం. టీ పార్టీ కోసం అంత దూరం వెళ్లడమే గొప్ప.. కానీ వీళ్లు వెరీవెరీ స్పెషల్.. వీళ్లు తమ టీ పార్టీని ఏకంగా ఎత్తయిన శిఖరం మీద పెట్టుకున్నారు. అదికూడా సముద్రమట్టానికి 21,312 అడుగుల ఎత్తుకెళ్లి, మౌంట్ ఎవరెస్ట్(Mt Everest)పై తేనీరు సేవించి గిన్నిస్‌బుక్ (NEW GUINESS WORLD) లో చోటుసంపాదించారు. అథ్లెట్, పర్వతారోహకుడు అయిన ఆండ్రూ హ్యూస్ తన సహచరులతో కలిసి ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అతడికి ఈ ఆలోచన వచ్చిందట. ఆ సమయంలో ప్రకృతిని చాలా మిస్ అయ్యానని, లాక్‌డౌన్ తర్వాత తన సహచరులతో కలిసి ఏదైనా సాహసం చేయాలని నిర్ణయించుకున్నట్లు హ్యూస్ తెలిపాడు. గతేడాది ఈ ఫీట్ చేయగా, తాజాగా గిన్నిస్‌లో చోటు లభించింది.
View this post on Instagram
Also Read: Assam Police: అసోంలో అక్రమంగా డ్రగ్స్ రవాణా.. ఇద్దరు అరెస్ట్.. రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
RRR Movie: రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..