Viral News: నాకు గత జన్మ గుర్తొచ్చింది.. దాని గురించి తెలుసుకోవడానికి సెలవు కావాలి. ఉద్యోగి లీవ్ లెటర్ వైరల్..
Viral News: విద్యార్థి దశ నుంచి ఉద్యోగి దశ వరకు మనం ఏదో ఒక సమయంలో సెలవులు తీసుకునే ఉంటాం. అయితే సెలవులు తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వీటిలో సాధారణంగా జ్వరం రావడం, లేదా..
Viral News: విద్యార్థి దశ నుంచి ఉద్యోగి దశ వరకు మనం ఏదో ఒక సమయంలో సెలవులు తీసుకునే ఉంటాం. అయితే సెలవులు తీసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వీటిలో సాధారణంగా జ్వరం రావడం, లేదా బంధువుల పెళ్లిలు, శుభ కార్యక్రమాలు ఇలా బోలేడు ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగి చెప్పిన కారణం ఏంటో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవడమే కాదు, ఆశ్చర్యానికి గురవుతారు.
ఇంతకీ విషయమేంటంటే.. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి.. సంశేర్ జనపద్ పంచాయతీ మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్‌లో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పంచాయతీ చీఫ్‌కు లేఖ రాస్తూ ప్రతి ఆదివారం తనకు ‘డే ఆఫ్’ కావాలని పేర్కొన్నాడు. అయితే సెలవులు ఎందుకు కావాలన్న దానికి ఆ ఉద్యోగి పేర్కొన్న కారణమేంటంటే.. రాజ్ కుమార్‌కు ఇటీవల తన గత జన్మ గుర్తొంచిందంటా. గతకొన్ని రోజులుగా రాత్రి పడుకునే సమయంలో పోయిన జన్మ తాలుకూ జ్ఞాపకాలు కలలో వస్తున్నాయని, ఇందులో భాగంగానే తన గత జన్మ తాలుకూ విషయాలను తెలుసుకోవడానికి, భగవద్గీతను స్టడీ చేయడానికి సెలవు కావాలంటూ లేఖలో పేర్కొన్నాడు.
దీంతో ఈ లేఖ కాస్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలవు కోసం ఇలాంటి కారణం కూడా చెప్పొచ్చని ఇప్పటి వరకు తెలియలేదంటూ పలువరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.