Funny Video: వాహనాలు వస్తున్నాయి రోడ్డు దాటు రా అయ్యా… కాకిని ఓ రేంజ్‌లో సతాయించిన ముల్లపంది..
Funny Video: ఎవరైనా నిస్సహాయకులు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. చాలా మందికి వారికి సహాయం చేస్తుంటారు. వృద్ధులు, వికలాంగులు,

Funny Video: ఎవరైనా నిస్సహాయకులు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. చాలా మందికి వారికి సహాయం చేస్తుంటారు. వృద్ధులు, వికలాంగులు, గర్ణిణీలు, చిన్న పిల్లలకు రోడ్డు దాటంతో సహకరిస్తుంటారు కొందరు. వారిని క్షేమంగా రోడ్డు దాటించిన తరువాత తమ దారిన తాము వెళ్లిపోతారు. ఇలాంటి సందర్భాలు మనం చాలానే చూశాం. అయితే, జంతువులు కూడా కొన్ని కొన్నిసార్లు రోడ్ల మీదకు వస్తుంటాయి. కానీ, వాహనాల రద్దీ కారణంగా అవి రోడ్డు దాటేందుకు తీవ్ర అవస్థలు పడుతుంటాయి. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి అవి ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి. అయితే, మనిషికి మరో మనిషి సాయం చేసినట్లే.. ఇక్కడ ఓ మూగ జీవికి మరో మూగ జీవి సాయం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఓ చిన్ని ముల్లపంది రోడ్డు మీదకు వచ్చింది. వాహనాల రద్దీ ఉండటంతో భయపడుతూనే రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో ముల్లపంది అవస్థలను గమనించిన కాకి.. దానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ముల్లపందిని వెనక నుంచి పొడుస్తూ ముందుకు పదా అని తరుముతోంది. అయితే, సాయం చేద్దామని వచ్చిన కాకికి ఆ ముల్లపంది చుక్కలు చూపించింది. ఒక అడుగు ముందుకు వేసి, వెంటనే భయంతో ముడుచుకుంటోంది. దీని చర్యతో కాకి తలప్రాణం తోకకు వచ్చినట్లయ్యింది. అయితే, ముల్లపందిని రోడ్డు దాటించేందుకు కాకి పడిన తాపత్రయం అంతా కారులోని ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. కాకి అవస్థలు, ముల్లపంది భయం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరోవైపు, కాకి సాయానికి సలాం చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కుసుకోండి.




Driver slows down to watch as crow helps scared hedgehog cross the road pic.twitter.com/NhFnFJ9GgV
— Gabriele Corno (@Gabriele_Corno) September 7, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
