AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kindness: హోరు వర్షంలో రోడ్డుమీద తడుస్తూ కుక్క.. అప్పుడు ఆ చిన్నారి ఏం చేసిందో చూడండి..Viral Video

ప్రపంచం.. స్వార్థం.. కల్లాకపటం ఇవేవీ వారికి తెలీదు. అందుకే చిన్నారుల్లో దయా హృదయం ఎక్కువగా కనిపిస్తుంది. వారి ఆట పాటల్లో.. నడతలో ఒక్కోసారి వారు చేసే చిన్ని చిన్ని పనుల్లో ఎంతో ముచ్చట ఉంటుంది.

Kindness: హోరు వర్షంలో రోడ్డుమీద తడుస్తూ కుక్క.. అప్పుడు ఆ చిన్నారి ఏం చేసిందో చూడండి..Viral Video
Kindness Of Child
KVD Varma
|

Updated on: May 04, 2021 | 8:25 AM

Share

Kindness: ప్రపంచం.. స్వార్థం.. కల్లాకపటం ఇవేవీ వారికి తెలీదు. అందుకే చిన్నారుల్లో దయా హృదయం ఎక్కువగా కనిపిస్తుంది. వారి ఆట పాటల్లో.. నడతలో ఒక్కోసారి వారు చేసే చిన్ని చిన్ని పనుల్లో ఎంతో ముచ్చట ఉంటుంది. చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి పెద్దల మనసుల్ని కదిలించేస్తాయి. వారు చేసే చిన్న పని మనకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది. చిన్న బాలిక చేసిన ఆ పనితో దయ అనే పదానికి సారైన అర్ధం కనిపించింది అని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండీగా మారిన ఆ వీడియోలో..

వర్షం పడుతోంది.. రోడ్డుమీద ఒక కుక్క తడిచిపోతోంది. అక్కడే గొడుగు వేసుకుని ఒక చిన్న పిల్ల నిలుచుని ఉంది. తదిచిపోతున్న కుక్కను చూసింది. తన గొడుగు తీసుకెళ్ళి ఆ కుక్కపై వర్షం పడకుండా అడ్డు పెట్టింది. దానిని జాగ్రత్తగా రోడ్డు దాటించి తీసుకువెళ్ళింది. అలాగే, ఆ కుక్కను వదిలేయడానికి ఆ చిన్నారి ఒప్పుకోలేదు. ఎంతో దయామయంగా కనిపించిన ఈ చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి మనసుల్నీ తడి చేస్తోంది.

ఆ వీడియో ట్వీట్..

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ రోజు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే వందలాది మంది దీనిని రెట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేస్తూ సుశాంత నందా “దయ మరొకరి కోసం చిన్నచిన్న పనులు చేయిస్తుంది..ఇదే పనీ దయతో మీరు చేయగలరు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో చూసిన వారు చేస్తున్న కామెంట్లలో కొన్ని..

Also Read: British Woman: కవలలు అని ముగ్గురు తినే ఆహారం తింది… తీరా చూస్తే.. బాల భీముడికి జన్మనిచ్చింది.. ఎక్కడంటే

Adopt: వాళ్ళు రిటైర్ అయి విశ్రాంతి కోరుకున్నారు..తమకంటె పెద్ద మహిళను దత్తత తీసుకున్నారు.. ఎందుకంటే..