మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి.. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో

చిన్న పిల్లల మనస్సు చాలా తేలికైనది. ఏదీ దాచుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చేప్పేస్తారు. వారు చేసే చిన్నచిన్న పనులు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు వారి అమాయకత్వం అయ్యో పాపం అనిపిస్తుంది. వారు ఎక్కువ సమయంలో..

మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి.. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో
Child Crying
Ganesh Mudavath

|

Sep 29, 2022 | 10:21 AM

చిన్న పిల్లల మనస్సు చాలా తేలికైనది. ఏదీ దాచుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చేప్పేస్తారు. వారు చేసే చిన్నచిన్న పనులు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు వారి అమాయకత్వం అయ్యో పాపం అనిపిస్తుంది. వారు ఎక్కువ సమయంలో స్కూళ్లలోనే గడుపుతుంటారు. దీంతో వారికి టీచర్లతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రోజూ స్కూల్ కు వెళ్లడం, టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయడం ఇలా వారి షెడ్యూల్ బిజీ బిజీగా అయిపోతుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాక కూడా కొందరికి హోమ్ వర్క్ ఇస్తుంటారు. ఇంటికి వెళ్లాక అక్కడ చేసి మరుసటి రోజు చూపించాలని చెబుతారు. అయితే కొంత మంది వర్క్ పూర్తి చేస్తే.. మరికొందరు మాత్రం మర్చిపోతుంటారు. తర్వాతి రోజు టీచర్ హోమ్ వర్క్ అడిగితే వారికి వింత వింత సమాధానాలు చెప్తుంటారు. మనం కూడా మన పాఠశాలలో ఇలాంటి అబద్ధాలు చెప్పే ఉంటాం. టీచర్లను కూల్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఏడిస్తే.. మరి కొందరు మాత్రం నవ్వుతూ ఫిదా చేస్తారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి ఏడుస్తూ ఉండటాన్ని చూడవచ్చు. ఆమెను టీచర్ చేరదీసి.. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించింది. దానికి ఆ బాలిక తన మమ్మీ రోజూ కొడుతోందని, పరిగెత్తించి మరీ దారుణంగా కొడుతోందని కన్నీటిపర్యంతమైంది. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 23 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనితో పాటు, నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పిల్లల క్యూట్‌నెస్ నా హృదయాన్ని గెలుచుకుందని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu