AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటి పునాది కోసం కూలీలు తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో.. ఏంటా అని చూడగా

భూమి నుండి సుమారు 35 నుండి 40 నాణేలు బయటపడినట్లు చెబుతున్నారు. వాటిని చూసిన పొరుగింటి వ్యక్తి.. వాటా కోరడంతో.. గొడవ మొదలైంది. అందరూ గుమికూడటంతో.. కూలీలు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. పోలీసులు ఇప్పటి వరకు కేవలం 7 నాణేలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నాణేలు దాదాపు 150 ఏళ్ల నాటివని, వివిధ సంవత్సరాలకు చెందినవిగా చెబుతున్నారు. ఈ నాణేలు 1885వ సంవత్సరం నాటివని, వాటిపై విక్టోరియా సంతకం ఉందని చెబుతారు.

Viral: ఇంటి పునాది కోసం కూలీలు తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో.. ఏంటా అని చూడగా
Silver Coins (Representative image)
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2024 | 5:39 PM

Share

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో మంగళవారం మార్చి 5న ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు దొరికాయి. గ్వాలియర్‌లోని ఖల్లాసిపురా ప్రాంతంలో కూలీలు ఈ నాణేలను వెలికితీశారు. సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించేందుకు కూలీలు కుదుర్చుకున్నాడు. వారు గొయ్యి తవ్వుతుండగా, వెండి నాణేలు దొరికినట్లు స్థానికులు తెలిపారు. నిధి దొరికిందన్న వార్తతో ఆ ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఈ నాణేలను పంచుకుని గుట్టు చప్పుడు కాకుండా ఎస్కేప్ అయ్యేందుకు కూలీలు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కూడా సంజయ్ పాల్ పొరుగింటి వ్యక్తి కూడా నాణాల్లో వాటా కోసం పట్టుబట్టాడు. దీంతో ఘర్షణ చెలరేగింది. దీంతో సంజయ్ పాల్ కుటుంబ సభ్యులకు కూడా విషయం తెలియడంతో.. వెంటనే అక్కడకు వెళ్లారు.

ఇంటి పునాదులు తీస్తుండగా.. దొరికిన నిధి గురించి విన్నామని, కూలీలకు సుమారు 40 నుంచి 50 నాణేలు దొరికినట్లు చెప్పారని.. తాను ఇంటి వద్దకు చేరుకునే సరికి, అక్కడ ఎవరూ లేరని సంజయ్ పాల్ కుమారుడు హరీశ్ తెలిపాడు. దీంతో  హరీష్ జనక్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  ఫిర్యాదు మేరకు ఒక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుందని, వాటా కోరిన ఇంటి పొరుగు వ్యక్తితో పాటు ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్నామని జనక్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. వారి నుంచి బ్రిటీష్ కాలం నాటి ఏడు వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమైనా దాచారా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ నాణేలు 150 ఏళ్ల నాటివిగా భావిస్తున్నారు. 

 “నాణేల గురించి పురావస్తు శాఖను కూడా సంప్రదించాం. వారు నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత.. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం” అని పోలీసులు తెలిపారు. ఇంకా ఏమైనా నాణేలు దాచి ఉంటే.. వాటిని స్వాధీన పరుచుకుంటామని చెప్పారు. (Source)

British Era Coins

British Era Coins

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.