Viral Video: అక్కడెలా దూరావ్ మావ.! ఇంటి గోడలో కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే
సహరన్పూర్‌లోని ఒక ఇంటి గోడలో నుంచి, అలాగే నేల నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అక్కడున్నవారు చెక్ చేయగా.. కుప్పలు తెప్పలుగా పాములు బయటకు వచ్చాయి. ఆపై సురక్షితంగా వాటిని బంధించి అడవిలోకి వదిలారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక్కసారి ఊహించుకోండి.! మీరు నివసించే ఇంటిలో ఒకటి కాదు రెండు కాదు.. కుప్పలు తెప్పలుగా పాములు దాగి ఉంటే.. ఆ ఊహే వణుకు పుట్టిస్తోంది కదా.! ఇది నిజంగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జరిగింది. ఒక ఇంటి ఇటుక గోడల నుంచి కుప్పలు తెప్పలుగా పాములు బయటపడ్డాయి. వాటిని చూడగా ఇంటి యజమాని దెబ్బకు షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్థానిక ముజఫరాబాద్ ప్రాంతంలోని బధేరి ఘోగు గ్రామంలో మంగళవారం ఉదయం ఒక ఇంటి నుంచి ఏడు పాములను బయటకు తీశారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా భయాందోళనలు గురి చేసింది. మొదటిగా సదరు కుటుంబం ఓ పామును చూడగా.. ఆపై అక్కడికి గ్రామస్తులు చేరుకునేసరికి గోడలోపల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు పాములు కనిపించాయి. పాములు పట్టేవాడిని తీసుకొచ్చి.. ఆ ఏడు పాములను సుమారు గంటసేపటి తర్వాత సురక్షితంగా బంధించి.. అడవిలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
కాగా, పాములు పాత రంధ్రంలో లేదా నేల కింద ఉన్న బోయిలో దాక్కున్నాయని.. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు వల్ల ఇలా బయటకు వచ్చాయని స్నేక్ క్యాచర్ అన్నాడు. ఎలాంటి హనీ జరగకుండా పాములను అడవిలోకి వదిలేశామని చెప్పాడు.
