AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : డిసెంబర్ 16 వేలంలో కొత్త ట్విస్ట్..350 కాదు, 359 మంది..ఐపీఎల్ వేలం లిస్ట్‌లో అకస్మాత్తుగా మరో 9 పేర్లు

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మంగళవారం, డిసెంబర్ 9, 2025న, ఉన్న ఆటగాళ్ల జాబితాకు 9 కొత్త పేర్లను జోడించింది. ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనుంది.

IPL 2026 : డిసెంబర్ 16 వేలంలో కొత్త ట్విస్ట్..350 కాదు, 359 మంది..ఐపీఎల్ వేలం లిస్ట్‌లో అకస్మాత్తుగా మరో 9 పేర్లు
Ipl 2026 Auction
Rakesh
|

Updated on: Dec 10, 2025 | 1:13 PM

Share

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మంగళవారం, డిసెంబర్ 9, 2025న, ఉన్న ఆటగాళ్ల జాబితాకు 9 కొత్త పేర్లను జోడించింది. ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనుంది. డిసెంబర్ 9 ఉదయం, బీసీసీఐ మొత్తం 1355 రిజిస్ట్రేషన్ల నుంచి 350 మంది ఆటగాళ్లను సెలక్ట్ చేసిన తుది జాబితాను విడుదల చేసింది. అయితే కొన్ని గంటల తర్వాత, బీసీసీఐ సవరించిన జాబితాను విడుదల చేసింది. అందులో 9 కొత్త పేర్లు యాడ్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం తుది జాబితాలో మొత్తం 359 మంది ఆటగాళ్లు ఉన్నారు.

బీసీసీఐ కొత్తగా చేర్చిన ఆటగాళ్లలో ఐపీఎల్ విజేత అయిన స్వస్తిక్ చిక్కారా కూడా ఉన్నారు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసిన స్వస్తిక్‌కు సంబంధించిన వీడియోలు, 2025 ఐపీఎల్ సీజన్ మొత్తంలో విరాట్ కోహ్లీతో కలిసి చర్చనీయాంశమయ్యాయి. వీరితో పాటు మలేషియాకు చెందిన విరన్‌దీప్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరారు. అసోసియేట్ దేశాల నుంచి ఈ జాబితాలో ఉన్న ఏకైక ఆటగాడు ఇతనే. మిగిలిన ఏడుగురు ఆటగాళ్లలో త్రిపుర ఆల్‌రౌండర్ మణిశంకర్ మురసింఘ్, చామా మిలింద్ (హైదరాబాద్), కె.ఎల్. శ్రీజిత్ (కర్ణాటక), ఇథన్ బాష్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గ్రీన్ (ఆస్ట్రేలియా), రాహుల్ రాజ్ నమాలా (ఉత్తరాఖండ్),విరాట్ సింగ్ (జార్ఖండ్) ఉన్నారు.

ఐపీఎల్ 2026 మినీ వేలం తుది జాబితాలో ప్రస్తుతం 359 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 247 మంది భారతీయ ఆటగాళ్లు, 112 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ తుది జాబితాలోని ఆటగాళ్లలో కేవలం 77 మందికి మాత్రమే ఐపీఎల్ 2026 కాంట్రాక్టులు లభిస్తాయి. ఇందులో విదేశీ ఆటగాళ్ల కోసం 31 రిజర్వ్ స్థానాలు కేటాయించారు.

జాబితా సవరణకు ఒక ముఖ్య కారణం నిఖిల్ చౌదరి విషయంలో జరిగిన పొరపాటే. నిఖిల్ గతంలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి పంజాబ్‌కు దేశీయ క్రికెట్ ఆడాడు. దాదాపు ఆరేళ్ల క్రితం తన మామను కలవడానికి ఆస్ట్రేలియా వెళ్లిన నిఖిల్, కోవిడ్ కారణంగా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించి, చాలా సంవత్సరాల కృషి తర్వాత ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్‌లో స్థానం సంపాదించాడు. గత నెలలో టాస్మానియా తరఫున షెఫీల్డ్ షీల్డ్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ సంతతి ఆటగాడిగా నిఖిల్ రికార్డు సృష్టించాడు.

నిఖిల్ గ్లోబల్ సూపర్ లీగ్, మ్యాక్స్ 60 కరీబియన్, అబుదాబి టి10 వంటి అనేక విదేశీ వైట్-బాల్ లీగ్‌లలో కూడా ఆడాడు. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలం మొదటి జాబితాలో నిఖిల్‌ను భారతీయ ఆటగాడిగా పొరపాటున నమోదు చేశారు. బీసీసీఐ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన సవరించిన జాబితాలో ఈ పొరపాటును సరిదిద్దింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా