Viral: పురావస్తు తవ్వకాల్లో వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటని వెలికితీసి చూడగా.!
పురావస్తు తవ్వకాల్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అధికారులు మూడు చోట్ల పురావస్తు తవ్వకాలు జరిపారు. వారికి అప్పుడే ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఏంటని దాన్ని వెలికితీసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రిటన్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని గుర్తించారు. మాములుగా ఏ గుడ్డు అయినా కొన్ని రోజులే నిల్వ ఉంటుంది. ఓ రోమన్ విషింగ్ వెల్‌లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకి తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్‌ల వైభవాన్ని గుర్తు చేస్తోంది.
ఐల్స్‌బరీ ప్రాంతంలో శాస్తవేత్తలు 2007-2016 నుంచి త్రవ్వకాలను జరుపుతున్నారు. ఇక మైక్రో స్కాన్‌లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొన చెక్కు చెదరకుండా ఉంది. నాటి రోమన్లు వాడిన సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆక్స్‌ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రపంచంలోనే వేల ఏళ్లకూ చెక్కుచెదరని తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు.
నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నామనీ అయితే స్కాన్‌లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించిందనీ దీన్ని తాము లండన్‌లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
