వామ్మో ..నడి సముద్రంలో వలలో చిక్కిన 100 ఏళ్ల నాటి రాక్షస చేప..ఎన్ని కిలోలంటే..? Viral photo
100 Year Old Monster Fish: అమెరికా సముద్రంలో భారీ రాక్షస చేప పట్టుబడింది. ఈ చేప బరువులో.. వయసులో కూడా రికార్డు నమోదు చేసింది. అవును.. ఆ చేపను
100 Year Old Monster Fish: అమెరికా సముద్రంలో భారీ రాక్షస చేప పట్టుబడింది. ఈ చేప బరువులో.. వయసులో కూడా రికార్డు నమోదు చేసింది. అవును.. ఆ చేపను చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకూ 100ఏళ్లకు పైబడిన చేప వలకు చిక్కలేదని శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. గత వారం యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ సిబ్బంది ఈ చేపను పట్టుకున్నారు. వందేళ్లకుపైగా వయసున్న ఆ చేప 7 అడుగుల పొడవుంది. బరువు సుమారు 108 కిలోలు. అమెరికా డెట్రాయిట్ నదిలో దొరికిన ఈ అరుదైన చేప ఆడదని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్ సంస్థ ఈ రాక్షస చేప ఫొటోను విడుదల చేసింది. చేప సైజు ఆకారం మీద అవగాహన రావడానికి దానిపక్కన సంస్థ సిబ్బంది ఒకరు పడుకుని సైతం ఫొటో దిగారు. కొలతలు తీసుకున్న తర్వాత తిరిగి చేపను నీటిలో వదిలినట్లు అధికారులు వెల్లడించారు. లావు, ఆకారం బట్టి చేపను ఆడదని గుర్తించారు. ఇది స్టర్జన్ జాతికి చెందిన చేపగా అధికారులు వెల్లడించారు.
కాగా.. మగ చేప అయితే సుమారు 55 ఏళ్లపాటే బతుకుతుందని.. అదే ఆడచేప అయితే.. 70 నుంచి వందేళ్లు బతుకుతుందని సిబ్బంది తెలిపారు. డెట్రాయిట్ నదిలో పట్టుబడిన ఈ చేప వందేళ్లకు పైగా నీళ్లలో మనుగడ సాగిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే.. దీనిని పట్టుకునేందుకు రౌండ్ గోబీ అనే చేపను ఎరగా వేసినట్లు అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ సర్వీసెస్ వెల్లడించింది. ఏప్రిల్ 22న డెట్రాయిట్‌కు దక్షిణంగా గ్రోస్ ఐస్ సమీపంలో ఈ రాక్షస చేప పట్టుబడింది. ప్రస్తుతం ఈ చేప ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్పెనా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఆఫీస్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన నాటి అత్యధిక లైక్‌లు, షేర్‌లు లభించాయి.
Also Read: