Viral News: రిలాక్స్ అవుతున్న పిల్లి.. పైపైకి పాకుతున్న పాము.,. షాకింగ్ వీడియో.!
Cat Viral Video: ఓ పిల్లి తన వేటను ముగించుకుని ఇంచక్కా రిలాక్స్ అవుతోంది. గాఢమైన నిద్రలోకి జారుకుని.. అటు ఇటూ..
Cat Viral Video: ఓ పిల్లి తన వేటను ముగించుకుని ఇంచక్కా రిలాక్స్ అవుతోంది. గాఢమైన నిద్రలోకి జారుకుని.. అటు ఇటూ తిరుగుతూ ఒళ్లు విరుస్తోంది. అయితే అప్పుడే అనుకోని అతిధిలా ఎక్కడ నుంచో ఓ పాము నెమ్మదిగా దానిపై పాకడం మొదలు పెట్టింది. అసలే మంచి నిద్రలో ఉన్న పిల్లికి.. తన శరీరంపై ఏదో పురుగు పాకుతోందేమోనని పట్టించుకోలేదు.
సమయం గడుస్తోంది. ఇంకా తన శరీరంపై ఏదో పాకుతున్న సౌండ్ వస్తోంది. దీనితో ఆ పిల్లి మెల్లిగా కళ్ళు తెరిచింది. తన శరీరంపై ఏం పాకుతోందా.? అని గమనించి చూసేసరికి ఒక్కసారిగా దాని గుండె ఝల్లుమంది. అది ఒక పాము. ఇంకేముంది వెంటనే తేరుకున్న పిల్లి చటుక్కున గాలిలోకి ఎగిరి అక్కడ నుంచి పారిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీన్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు. ”పాపం.. పిల్లి నిద్ర పాము చెడకొట్టిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ‘గాలిలో భలే ఎగిరిండిగా పిల్లి’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియో చూసేయండి..
Also Read:
Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?
Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!