ప్రముఖ రంగస్థల నటుడు మృతి
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి(65) కన్నుమూశారు. రంగస్థలం నుంచి బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా...

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి(65) కన్నుమూశారు. రంగస్థలం నుంచి బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా ఎదిగారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో రంజిత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా రంజిత్ చౌదరి మరణానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రంజిత్ నటుడే కాకుండా.. మంచి రచయిత కూడా. హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో రేఖ, రాకేష్ రోషన్ ‘ఖూబ్ సూరత్’ సినిమాలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కట్టా మీటాతో పాటు పలు చిత్రాల్లో నటించారు. అలాగే దూరదర్శన్‌తో పాటు పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. కాగా ఆయన మరణ విని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మే 5న సంతాప సభ జరపబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 1980లో అమెరికా వెళ్లిన రంజిత్ రంగస్థల నటుడిగా పలు ప్రదర్శనలు ఇచ్చారు.
Read More: పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్
‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?
వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా
అగ్రరాజ్యాలతో పోటీగా.. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ధీటైన పోటీ