Telangana: తెలంగాణలో వరద రాజకీయం.. సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్.. పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్
తెలంగాణలో (Telangana) వరద రాజకీయం మొదలైంది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బాధితులకు పరామర్శలు చేస్తూనే, రాజకీయ సెగలు రేపుతున్నాయి విపక్షాలు. వైఎస్సార్‌టీపీ అధినేత...
తెలంగాణలో (Telangana) వరద రాజకీయం మొదలైంది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బాధితులకు పరామర్శలు చేస్తూనే, రాజకీయ సెగలు రేపుతున్నాయి విపక్షాలు. వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల (YS.Sharmila), వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె.. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల రాక సందర్భంగా వైఎస్సార్‌టీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలతో కార్యకర్తలు గ్రామాల్లో హడావిడి చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో వైఎస్సార్టీపీ (YSRTP) జెండా ఆవిష్కంచి పార్టీ నేతలతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు రోజులపాటు షర్మిల టూర్ కొనసాగనుంది.
వారం రోజుల క్రితం కురిసిన వర్షాలు, వరదలతో తెలంగాణ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కారణంగా మంచిర్యాల, మంథని, కాళేశ్వరం, భద్రాచలం నీట మునిగాయి. భద్రాచలం రామాలయం నీట మునిగింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా నీటిమట్టం 70 అడుగులు దాటింది. పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను పునారావాస కేంద్రాలకు తరలించి, ఆశ్రయం కల్పించారు. బాధితుల పరిస్థితిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు భద్రాచలంలో గోదావరికి శాంతి పూజలు చేశారు.
భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేలు ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, తదుపరి పర్యటనలో దీనిపై పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి