YS Sharmila: చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడు.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

సింగరేణి కాలనీ చిన్నారి ఘటనను తెలంగాణ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు.

YS Sharmila: చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడు.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
Ys Sharmila
Follow us

|

Updated on: Sep 16, 2021 | 8:45 PM

YS Sharmila on Saidabad Incident: సింగరేణి కాలనీ చిన్నారి ఘటనను తెలంగాణ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. గురువారం లోటస్‌పౌండ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు వేయాల్సిన అవసరముందన్నారు. ఎందంటే మరెన్నో ఘటనలు జరుగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలా జరుగుతోందని మండిపడ్డారు. చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని ఆమె చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా గల్లీకో వైన్ షాపు దర్శనమిస్తోందని చెప్పారు. మత్తులోనే ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అసరముందన్నారు. నిందితులు ఆత్మహత్యలు చేసుకునే వరకూ పట్టించుకోకపోతే.. ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకని షర్మిల ప్రశ్నించారు. 6 ఏళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి హత్యచేస్తే.. 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తాము దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు షర్మిల.

శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై.. రాత్రి 2 గంటల సమయంలో 200మంది పోలీసులు దాడి చేశారన్నారు. బలవంతంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. శాంతియుతంగా దీక్ష చేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. దీక్ష చేస్తున్న వారిపై దాడులు చేయడం.. తాలిబన్ల చర్యను తలపిస్తోందని చెప్పారు. చిన్నారికి ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం.. దేవుడు చేశాడన్నారు. జగిత్యాలలో కూడా ఇలాంటి ఘటనే మరోటి జరిగిందని తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోరు అనే ధైర్యంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు. మత్తు పదార్థాల కారణంగా యువత పాడై పోతోందన్నారు.

రాష్ట్రంలో 300 పాఠశాలలను మూసివేశారని, 14,000 మంది టీచర్లను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయ్యాక, 300 శాతం మద్యం విక్రయాలు పెరిగిపోయాయని వివరించారు. అలాగే 300శాతం మహిళల పైన దాడులు పెరిగాయని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం, పోలీసుల వైఫల్యమే కారణమని షర్మిల వ్యాఖ్యానించారు.

Read Also…  Viral Video: ఏడాదిన్నర కూడా లేని ఈ చిన్నారి సంతోషం.. నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది..! వీడియో