YS Sharmila: పాదయాత్రలో అరుదైన ఘటన.. మొక్కజొన్న పొత్తులను కాల్చిన షర్మిల.. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని హామీ

షర్మిల దేవ‌ర‌క‌ద్ర‌లో పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తున్న ఓ మహిళను చూశారు..

YS Sharmila: పాదయాత్రలో అరుదైన ఘటన.. మొక్కజొన్న పొత్తులను కాల్చిన షర్మిల.. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని హామీ
Ys Sharmila
Follow us

|

Updated on: Sep 12, 2022 | 5:11 PM

YS Sharmila: ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు, ఓటర్లను ఆకట్టుకోవడానికి లెక్కలేన్నన్ని చిత్ర విచిత్ర పనులను చేస్తారు.. రకరకాల వేషాలతో, పనులతో ప్రచారం సాగిస్తారు.. పాదయాత్రలు చేస్తూ.. చిన్నారులకు స్నానం చేయించేవారు కొందరైతే.. బజ్జీలు వేయడం, ఇస్త్రీ చేసేవారు ఇలా రకరకాల పనులు చేస్తూ ఓట్ల కోసం పాట్లు పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు జరగడంలేదు.. ఎన్నికలకు సమయంకూడా ఉంది. అయితే ఇప్పుడు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పొత్తులు కాలుస్తూ కనిపించారు.

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రజాప్రస్థానం  యాత్ర చేపట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రజా ప్రస్థాన పాదయాత్ర నేడు 149 రోజుకు చేరుకుంది. ఈ యాత్ర ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా షర్మిల దేవ‌ర‌క‌ద్ర‌లో పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తున్న ఓ మహిళను చూశారు.. వెంటనే ఆమె దగ్గరకు చేరుకొని.. అక్కడ కూర్చుని నిప్పుల‌పై మొక్క‌జొన్న పొత్తుల‌ను పెట్టి కాల్చారు.  సిల్వర్ ప్లేట్ తో గాలిని విసురుతూ మొక్క జొన్న పొత్తులను అనుభవం ఉన్న వ్యక్తిలా కాల్చడంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ సంద‌ర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రజాప్రస్థానం సబ్బండ వర్గాల సమాహారమ‌ని పేర్కొన్నారు. యాత్ర‌లో ప్రతి ఒక్కరి బాధలు వింటామ‌ని చెప్పారు. అంద‌రినీ వెన్ను తట్టి భరోసా కల్పిస్తామ‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు చిరు వ్యాపారులకు అండగా ఉంటామ‌ని షర్మిల ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..