Krishnam Raju Death: ఏడ్చి ఏడ్చి కూలబడిపోయిన కృష్ణంరాజు భార్య..
కృష్ణంరాజు(Krishnam Raju)మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది.
సినిమాల్లో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాటి కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసి రాజకీయనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో కృష్ణంరాజుకు అదృష్టం కలిసొచ్చింది. 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. ఆఎన్నికల్లో కృష్ణం రాజుకు 3,30,381 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి తోట గోపాలకృష్ణకు 262,582 ఓట్లు వచ్చాయి. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి బీజేపీ తరపున కృష్ణంరాజు గెలిచి ఓరికార్డు సృష్టించారు. కాకినాడ ఏంపీగా ఏడాది మాత్రమే ఆయన పనిచేశారు. ఇక 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఏంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై 1,65,948 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కావడంతో కృష్ణం రాజు భారీ మెజార్టీ సాధించారు. ఇక రెండో సారి ఏంపీగా గెలవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను కేంద్రమంత్రి పదవితో గౌరవించింది. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర మంత్రిగా సేవలందించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

